అఖండ 2‌తో బోయపాటి–బాలయ్య రెమ్యూనరేషన్ హైప్!

Share


ఇప్పటి టాలీవుడ్ పరిస్థితిని చూస్తే, హీరోలతో పాటు దర్శకుల పారితోషికాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు సినిమా బడ్జెట్లు తక్కువగానే ఉండేవి. కానీ ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోల సినిమాల బడ్జెట్‌లు కనీసం ₹100 కోట్లు, మీడియం రేంజ్‌ సినిమాల బడ్జెట్‌లు కూడా ₹25 నుంచి ₹50 కోట్లు చేరాయి. ఈ మొత్తాల్లో ఎక్కువ భాగం హీరోలు, దర్శకుల పారితోషికాలకే వెళ్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడు ఎవరు అంటే, ఎస్.ఎస్. రాజమౌళి పేరు ముక్యంగా వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న పాన్-వరల్డ్ మూవీకి హాలీవుడ్ రేంజ్ పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్. రాజమౌళికి తరువాత స్థానం సుకుమార్‌కు దక్కుతుంది. పుష్ప సినిమా విజయం తరువాత ఆయన మార్కెట్‌ మరింత పెరిగింది. పుష్ప 2 కోసం ఆయన పారితోషికం గణనీయంగా పెరిగే అవకాశముందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

ఇక మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఇప్పుడు దర్శకుల పారితోషికాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణతో చేస్తున్న ‘అఖండ 2’ చిత్రానికి ఆయనకు సుమారు ₹40 కోట్లు పారితోషికంగా అందుతున్నట్టు వినిపిస్తోంది. ఇది నిజమే అయితే, బాలకృష్ణ పారితోషికం మరింత ఎక్కువగా ఉండటం ఖాయం.

ఇద్దరి కాంబినేషన్‌కి ఇప్పటికే గతంలో సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ హిట్‌లు ఉన్న నేపథ్యంలో, ఈ దఫా కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. అఖండ 2 ఇప్పటికే టీజర్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సనాతన ధర్మం నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం, ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ₹200 కోట్ల క్లబ్‌ను టచ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బోయపాటి – బాలయ్య కాంబో అంటే గ్యారెంటీ హిట్ అన్న నమ్మకంతో, ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగనున్నట్టు సమాచారం. ఇదే సినిమా ద్వారా బాలయ్య – బోయపాటి జోడీ డబుల్ హ్యాట్రిక్ కొడతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్!


Recent Random Post: