
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర హై వోల్టేజ్ ఎనర్జీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత ఇప్పుడు ఈ హిట్ జోడీ మరోసారి అఖండ 2: తాండవం తో వస్తున్నారు. ఇటీవల విడుదలైన బ్లాస్టింగ్ రోర్ టీజర్లో బాలయ్య చెప్పిన “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో” డైలాగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతుండగా, ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టింది.
ఇక ఈసారి క్రేజ్ మాత్రం కేవలం నందమూరి అభిమానులకే పరిమితం కాలేదు. ఇండస్ట్రీలోని యంగ్ హీరోల మధ్య కూడా అఖండ 2 గురించే హాట్ టాపిక్ నడుస్తోందట. ముఖ్యంగా త్వరలో రాబోయే ట్రైలర్ కోసం వాళ్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది బాలయ్యకు ఉన్న కొత్త తరం ఫాలోయింగ్‌కు పక్కా ప్రూఫ్ అని చెప్పాలి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అప్డేట్ కొంతమంది యంగ్ హీరోలకు ముందుగానే చేరిందట. ఆ సమాచారం తెలిసినప్పటి నుంచి వాళ్ల వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ నడుస్తోందని తెలుస్తోంది — “బోయపాటి ఈసారి ఏమి చూపించబోతున్నాడు?”, “బాలయ్య లుక్ ఎలా ఉంటుందా?” అంటూ డీప్‌గా డిస్కషన్ జరుగుతోందని టాక్. ఒక యంగ్ హీరో అయితే తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ, “ట్రైలర్ వచ్చాక ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది” అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడట.
ఈ ఆసక్తి చూస్తేనే, బోయపాటి ట్రైలర్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా కట్ చేశాడో అర్థమవుతోంది. మొదటి పార్ట్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌నే అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా డిజైన్ చేసినట్లు సమాచారం.
సాధారణంగా ఒక సీనియర్ హీరో సినిమా గురించి యంగ్ హీరోలు ఇలా ఆసక్తిగా మాట్లాడుకోవడం చాలా అరుదు. ఇది బాలయ్య స్టామినాను, బోయపాటి స్టైల్ మాస్ అట్రాక్షన్‌కు ఉన్న ఇంపాక్ట్‌ను మరోసారి నిరూపిస్తోంది. యూత్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా సమానంగా ఎంటర్టైన్ చేయగలగడం బాలయ్య స్పెషాలిటీ.
ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నది ఒక్కటే — అఖండ 2 ట్రైలర్! అది వచ్చాక నిజంగానే ఇండస్ట్రీ మొత్తం గట్టిగా మాట్లాడుకునే రేంజ్లో ఉంటుందా లేదా అనేది చూడాలి.
Recent Random Post:















