అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వయసు 80 ఏళ్లు దాటిపోయింది. ఈ వయసులో కృష్ణారామా అంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకునే వయసు. కానీ కంపు చేసిన డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వైఫల్యాలను చక్కదిద్దుకునేందుకు ఈ ముదిమి వయసులో ఆయన ఈ భారమైన బాధ్యతను తలకెత్తుకున్నారు. ఆ వృద్ధాప్యపు ఛాయలు మాత్రం ఇంకా బైడెన్ ను వెంటాడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు వయసుతోపాటు మతిమరుపు వచ్చేసింది. ఈ 80 ఏళ్ల వయసులో ఆయన ఊరికనే సభలు సమావేశాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ గందరగోళం అంతా వీడియోల్లో రికార్డ్ కావడంతో ఆయన పరువుపోతోంది. వయసుతోపాటు వచ్చిన మతిపరుపు ఆయనను బాధిస్తోంది. అదే నవ్వులపాలు చేస్తోంది.
జోబైడెన్ ద్వైపాక్షిక సమావేశాల్లో తరుచుగా దేశాధినేతల పేర్లు మార్చిపోతుంటారు. ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చి మాట్లాడాల్సిన టాపిక్ మరిచిపోతారు. ఒక దేశం పేరు బదులు మరొక దేశం పేరు ప్రస్తావిస్తారు. ఇలా జోబైడెన్ పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావనడంలో ఎలాంటి సందేహం లేదు. జోబైడెన్ మతిమరుపుపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా బైడెన్ మతిపరుపుపై ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న బైడెన్ మతిమరుపు ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్యగా మారింది. అల్జీమర్స్ వ్యాధితో ఆయన ఇబ్బందిపడుతున్నాడు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావడంతో ఆయన చేష్టలన్నీ వైరల్ అవుతున్నాయి. మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
తాజాగా న్యూయార్క్ గ్లోబల్ ఫండ్స్ సమావేశంలో జోబైడెన్ ప్రసంగించారు. ప్రసంగం ముగించాక ఆయన ఏ వైపు నుంచి వెళ్లాలో అర్థం కాక స్టేజీమీదనే బిక్కచూపులు చూశారు. పోడియం దగ్గర నుంచి అనుమానంగా నడుస్తూ ఆగిపోయారు. కనీసం సెక్యూరిటీ అయినా ఆయన ఎటు వెళ్లాలో సూచించలేదు. ఎటు వైపు దిగాలో తెలుపలేదు. ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. పాపం పెద్దమనిషి దారి మరిచిపోయి తడబడుతుంటే దాన్ని విమర్శకులు ఊరుకోకుండా ట్రోల్ చేస్తున్నారు.
ఎయిడ్స్ మలేరియా టీవీ వంటి వ్యాధుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిధి విరాళాల సేకరణ కోసం నిర్వహించిన మంచి కార్యక్రమంలో జోబైడెన్ పాల్గొన్నారు. ఆయన పిలుపుతో రికార్డు స్థాయిలో ఏకంగా 14.25 బిలియన్లు సేకరించారు. అందరికీ థాంక్యూ చెప్పిన జోబైడెన్ తను ప్రసంగించాక ఎటు వెళ్లాలో మరిచిపోయాడు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.
జోబైడెన్ వయసు ఎక్కువ అయినందున ఆయన ఆరోగ్యం గురించి అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. 2024లో మరోసారి అధ్యక్ష పదవిని కోరుకోనని జోబిడెన్ ఇదివరకే తెలిపారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. తాజాగా చాలా సందర్భాల్లో ఆయన మతిమరుపుతో ఇబ్బందులు పడుతున్నారు.. బైడెన్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు దాటింది. గతంలోనూ ఇలానే మరిచిపోతూ బైడెన్ అవస్థలు పడ్డ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Recent Random Post: