
నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో అమిగోస్, డెవిల్ సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో, ఈసారి చాలా గ్యాప్ తీసుకుని, కసితో ఈ ప్రాజెక్ట్‌పై పని చేశారు కళ్యాణ్ రామ్. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
కొన్ని వారాల క్రితం వరకు ఈ సినిమాపై బజ్ అంతగా లేకపోయినా, టీజర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా హైప్ ఏర్పడింది. ఇప్పుడు మాత్రం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్‌లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఇచ్చిన స్టేట్మెంట్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.
“ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాల క్లైమాక్స్ తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఇంతవరకు మన ఇండస్ట్రీలో ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్ రాలేదు. తల్లిని ప్రేమించే ప్రతిఒక్కరి కళ్లలో ఆ క్షణాల్లో నీళ్లు తిరుగుతాయి,” అని ఆయన చెప్పారు.
ఈ సినిమాలో తల్లి పాత్రలో లెజెండరీ నటి విజయశాంతి నటించడమూ విశేషం. ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆమె కొడుకు చట్టానికి విరుద్ధంగా నడుచుకుంటే, అతడిని అరెస్ట్ చేయాలనుకుంటుంది. ఈ తల్లి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగ భిన్నత, క్లైమాక్స్‌ను ఎంతో హైలైట్ చేస్తుందని చిత్రబృందం చెబుతోంది.
కళ్యాణ్ రామ్‌కు జోడీగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా సినిమా ప్రేక్షకులను ఎంతవరకు కదిలిస్తుందో ఏప్రిల్ 18న తెలుస్తుంది.
Recent Random Post:















