అలియా భట్ కొత్త యంగ్ అడల్ట్ సినిమా

Share


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. బీ-టౌన్‌లో టాప్ రేంజ్‌లో దూసుకెళ్తూనే, సౌత్ సినిమాల్లో కూడా ఆసక్తి చూపే ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్లో సీతగా నటించి అలరించిన విషయం తెలిసిందే. సినిమాలో తక్కువ సమయం మాత్రమే కనిపించినా, తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఇప్పుడు అలియా మరోసారి తెలుగుతో సహా పలు భాషల్లో రిలీజ్ కానున్న కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది యంగ్ అడల్ట్ జానర్‌లో, 18+ వయసు వారికి అనుగుణంగా రూపొందనున్న కథ. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం, కళాశాల నేపథ్యంలో, కొత్త క్యాస్ట్‌తో ఫ్రెష్‌గా తెరకెక్కనుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌గా విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌కు అలియా భట్ నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరించనుంది. ఆమె స్వంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్తో పాటు చాక్‌బోర్డ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది. దర్శకురాలిగా శ్రీతి ముఖర్జీ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఆసక్తికరంగా, ఆమె వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీకి బంధువురని సమాచారం.

ఈ ప్రాజెక్ట్ వెనక కూడా చిన్న కథ ఉంది. అలియాకు రణబీర్ కపూర్ నటించిన వేక్ అప్ సిడ్ సినిమా చాలా ఇష్టం. ఆ కథను అమ్మాయి కోణంలో, కొంచెం బోల్డ్‌గా చెబితే బాగుంటుందని శ్రీతికి అలియా చెప్పిందట. ఆ ఐడియా నచ్చడంతో, శ్రీతి స్టోరీని డెవలప్ చేసి, ఇప్పుడు అలియాను హీరోయిన్‌గా తీసుకొని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా, అలియా చాముండాలో నటిస్తుండగా, కల్కి 2లో కూడా ఆమె నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. రాబోయే ఈ ప్రాజెక్టులతో ఆమె ఎలాంటి హిట్స్ సాధిస్తుందో చూడాలి.


Recent Random Post: