
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ మరోసారి తన విలాసవంతమైన జీవనశైలితో వార్తల్లో నిలిచాడు. భారతదేశంలో ఎవరికీ లేని ఒక అద్భుతమైన బోయింగ్ 737 MAX 9 ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అల్ట్రా లగ్జరీ విమానం ఇటీవలే అంబానీ గ్యారేజీలో చేరింది.
రూ.1,000 కోట్ల విలువైన ఈ విమానం బాసెల్, జెనీవా, లండన్ వంటి ప్రాంతాల్లో కఠినమైన విమాన పరీక్షలు పూర్తి చేసిన అనంతరం భారతదేశానికి చేరుకుంది. ఇది అమెరికాలోని వాషింగ్టన్ రెంటన్‌లో బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో అసెంబుల్ చేయబడింది. అసలైతే 2022లో డెలివరీ కావాల్సిన ఈ జెట్, బోయింగ్ సంస్థ ఎదుర్కొన్న వివాదాల కారణంగా ఆలస్యమైంది. అయితే, ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9కు యజమానిగా ముఖేష్ అంబానీ నిలిచారు.
ఆకాశంలోని 7-స్టార్ హోటల్
ఇది సాధారణ ప్రైవేట్ జెట్ కాదని అంబానీ కుటుంబం నిరూపించింది. వారి వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా రీడిజైన్ చేయించిన ఈ జెట్, అత్యాధునిక సదుపాయాలతో తారాస్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే ఈ ప్రత్యేక మోడల్ జెట్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కావడం గమనార్హం. విస్తృతమైన క్యాబిన్, అధిక సామర్థ్యం కలిగిన కార్గో, CFMI LEAP-1B ఇంజిన్లు – ఇవన్నీ కలిపి ఈ విమానాన్ని నిజమైన ఆకాశంలోని 7-స్టార్ హోటల్‌గా మార్చాయి. ఈ జెట్ ఒక్కటే ప్రయాణంలో 11,770 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
అంబానీ ప్రైవేట్ జెట్ల గ్యారేజీ
ఈ కొత్త జెట్ చేరికతో, అంబానీ ఇప్పటికే పది ప్రైవేట్ జెట్ల ఓనరుగా నిలిచారు. ఇందులో బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు వంటి ప్రముఖ విమానాలు ఉన్నాయి.
Recent Random Post:















