ఆమిర్ ఖాన్‌పై సోదరుడు ఫైసల్ సంచలన ఆరోపణలు

Share


బాలీవుడు నటుడు ఆమిర్ ఖాన్‌పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ చేసిన సంచలన ఆరోపణలు సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్‌ క్రమశిక్షణతో మంచి ఇమేజ్‌ కలిగిన ఆమిర్‌పై, గతంలోనూ కొన్ని వివాదాలు ఎదురైనా, ఇంత తీవ్ర ఆరోపణ మాత్రం అరుదు.

ఫైసల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, తనను ఆమిర్ ఖాన్ సుమారు ఏడాది పాటు ఒక గదిలో నిర్బంధించాడని ఆరోపించారు. ఈ కాలంలో తన ఫోన్‌ను కూడా తీసేసి, బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచేశారని తెలిపారు. గది బయట బాడీగార్డులను ఉంచి, తనకు కేవలం మందులు మరియు ఆహారాన్ని మాత్రమే అందించారని ఆయన పేర్కొన్నారు.

తనపై కుటుంబ సభ్యులు మానసిక స్థితి బాగోలేదన్న ఆరోపణలు మోపారని, తాను సమాజానికి హానికరమని చెప్పి, ఈ నిర్బంధానికి పాల్పడ్డారని ఫైసల్ ఆరోపించారు. ఆస్తి పంపకాల వివాదంతో ప్రారంభమైన విభేదాలు ఈ స్థాయికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య కేసు కోర్టులో నడుస్తోంది.

ఈ ఆరోపణలపై ఆమిర్ ఖాన్ స్పందన ఏదీ రానుండగా, బాలీవుడు వర్గాలు మరియు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: