ఆస్కార్ 2025లో అనోరా దూకుడు, ఉత్తమ చిత్రంగా ఘనవిజయం!

Share


97వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరగగా, ఈసారి ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపికైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆస్కార్ వేడుకలో ప్రత్యేకంగా నిలిచి, మొత్తం ఐదు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లోనూ అనోరా విజయం సాధించింది.

ఈ చిత్రం ఓ వేశ్య జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన కథ కావడం విశేషం. కథలో, రష్యాకు చెందిన కోటీశ్వరుడు తన కుమారుడిని చదువుకోడానికి అమెరికా పంపిస్తాడు. అనుకోకుండా అక్కడ అతను ఓ వేశ్యను కలుస్తాడు. ఆమెతో వారం రోజులు ఉండేందుకు డబ్బులిచ్చి ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే, క్రమంగా అతను ఆమె ప్రేమలో పడతాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నా, ఈ విషయం తెలిసిన అతని తల్లిదండ్రులు అతడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోతారు.

అందులో అసలు ములువు ఏమిటి? ఆ వేశ్య ఆ తర్వాత ఏం చేసింది? ఆమె జీవితం ఎలా మారింది? అనేదే కథా ప్రయాణం. ఈ సినిమా వయోజన ప్రేక్షకులకు మాత్రమే అనుమతించబడిన చిత్రం, కానీ కథను ఆవిష్కరించిన విధానం, భావోద్వేగాల ప్రదర్శన, విజువల్ ట్రీట్మెంట్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడానికి కారణమయ్యాయి.

థియేట్రికల్ రన్‌లో అనోరా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. కేవలం కమర్షియల్ కోణాన్ని నమ్మని ఈ చిత్రం, వేశ్య వృత్తి వెనుక ఉన్న సాంఘిక పరిస్థితులు, మహిళలు ఎలా ఈ జీవితంలోకి దిగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు అనే అంశాన్ని హృద్యంగా చూపించింది. ద్వితీయార్థం గుండెలను తడిపేలా సాగిపోతుంది, క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ చిత్రం స్వల్ప వివాదాలకు గురైనప్పటికీ, కథనం తీరును చూసి ఎటువంటి విమర్శలు తలెత్తలేదని చెప్పుకోవచ్చు. ఆస్కార్ బరిలో గట్టిపోటీ ఉన్నా, అనోరా విజయం సాధించడం వెనుక ఉన్న కారణం, దాని హృద్యమైన కథనమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Recent Random Post: