యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పటికే చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి అవి కాకుండా కొత్తగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ను ప్రభాస్ చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
కానీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అనధికారికంగా దర్శకుడు మారుతి మొదలుకొని చిత్ర యూనిట్ సభ్యులు పలువురు చెప్పుకొచ్చారు. ప్రభాస్ సన్నిహితుల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ నెల 17వ తారీఖున సినిమా యొక్క పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరగబోతున్నాయట.
అంతే కాకుండా ఈ నెలలో మూడు రోజుల పాటు సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల్లో కూడా ప్రభాస్ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరగబోతుందని ఇప్పటికే మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లు నటించబోతున్నారు. వీరిద్దరు కాకుండా మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని మారుతి సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.
ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నింటికీ అక్టోబర్ 17వ తారీఖున సమాధానం లభించే అవకాశం ఉందని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కొంత మంది ప్రభాస్ అభిమానులు ఆ మధ్య మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా వద్దు అంటూ బాయ్కాట్ నినాదాన్ని ఎత్తుకున్నారు. కానీ ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయ్యాడు కనుక సినిమాను చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.
రాజా డీలక్స్ అనే టైటిల్ని మొదట అనుకున్నారు.. కానీ పాన్ ఇండియా రేంజ్ లో టైటిల్ ఉండాలనే ఉద్దేశంతో మరో టైటిల్ పరిశీలించే పనిలో దర్శకుడు మారుతి ఉన్నాడట. అక్టోబర్ 17 కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆరోజు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందేమో చూడాలి.
Recent Random Post: