
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనానికి కారణమైన సినిమా ఏదైనా ఉందంటే, అది ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. మోహన్ లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ కు కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజునే పెద్ద వివాదంలో చిక్కుకుంది.
సినిమాలోని ఆరంభ సన్నివేశాలు, కొన్ని పాత్రలు గోద్రా అల్లర్లుని గుర్తు చేసేలా ఉండడంతో, బీజేపీపై వ్యంగ్యంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విషయం ఎత్తుపడుతూ పార్లమెంటు చర్చలకు దారి తీసింది. ఇంత వ్యతిరేకత ఎదురైనా, మోహన్ లాల్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పడమే కాక, కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించించారు.
వివాదం ఎంత పెద్దదైనా, ఎంపురాన్ వసూళ్లపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. విడుదలైన తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి, రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గతంలో ‘మంజుమ్మల్ బాయ్స్’ నెలకొల్పిన రూ.242 కోట్ల రికార్డును ఈ చిత్రం చెరిపేసింది.
ఇండస్ట్రీ హిట్ లిస్టులో మోహన్ లాల్‌కు ఇది మరో మైలురాయి మాత్రమే. దృశ్యం, పులిమురుగన్, లూసిఫర్ వంటి సినిమాలతో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆయన, ఇప్పుడు ఎంపురాన్తో మరో మేటి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తొలుత ఆశించినంత బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా, వివాదాల నడుమ విపరీతమైన హైప్‌తో కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం, నిజమైన విజయానికి నిర్వచనంగా నిలిచింది. అయితే, ఈ వివాదాల నేపథ్యంలో ‘లూసిఫర్ 3’ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా చిత్ర బృందం స్పందిస్తూ—”తృటిలో లూసిఫర్ మూడో భాగం కూడా ఉండబోతున్నది” అని స్పష్టంగా తెలియజేసింది.
Recent Random Post:















