
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ఎంతో ఉపయోగకరమైనదిగా కనిపిస్తూనే, అదే సమయం లో కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల ఫోటోలు, గొంతు వాణిజ్య ప్రకటనల్లో, సోషల్ మీడియా వీడియోల్లో వారి అనుమతి లేకుండా వాడటం స్టార్ల ఇమేజ్‌కు నష్టం కలిగిస్తోంది. దీని ఫలితంగా, నటులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడడానికి న్యాయ పోరాటానికి దిగారు.
ఇక ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ముఖచిత్రాలను, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని స్పష్టంగా ఆదేశించింది. డిజిటల్ మీడియా లో వ్యక్తిగత హక్కుల భంగం జరగకుండా కోర్టు రక్షణ కవచం ఇచ్చింది. ఈ తీర్పు పై సినీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పుడే ఈ తీర్పుపై స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ सोशल మీడియాలో ట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ యుగంలో వ్యక్తిత్వ హక్కులను రక్షించేలా న్యాయస్థానం తీర్మానం ఇచ్చినందుకు ఆయన గౌరవ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో సహకరించిన న్యాయవాదులనూ, డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా దాకర్, మిస్టర్ రాజేందర్ మరియు రైట్స్ అండ్ మార్క్స్ టీమ్ అందించిన లీగల్ సపోర్ట్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వారి అంకితభావం వల్లే ఈ తీర్పు సాధ్యమైందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
ఈ తీర్పు ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసే వారికోచెదరింపు హెచ్చరికగా మారింది. ఇకపై ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో లేదా వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాక, మిగతా నటీనటులకూ ఇది ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recent Random Post:















