ఎన్టీఆర్ చరణ్.. ఆ టెన్షన్ ఎలా తట్టుకుంటున్నారో?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం ఊహించిన విధంగా ఉన్నాయి. ఒక కేటగిరి కి చెందిన హీరోలు అయితే చాలా ఆలస్యంగా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. మరి కొంతమంది అగ్ర హీరోలు మాత్రం చకచకా సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అందులో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ కూడా అదే తరహాలో వేగాన్ని పెంచుతున్నారు. ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. అయితే సినిమా ఆలస్యమైన పర్వాలేదు కానీ సినిమా కంటెంట్ మీద టెన్షన్ పెరుగుతూ ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆలస్యంగానే దేవర ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ ఆచార్య దెబ్బ పడిన తర్వాత ఎన్టీఆర్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. స్క్రిప్ట్ ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అయితే గాని జూనియర్ ఎన్టీఆర్ దాన్ని సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇక సైఫ్ అలీఖాన్ రావడం ఆ తర్వాత సినిమా అప్డేట్స్ మీద కాస్త నమ్మకం పెరిగినట్టే అనిపించింది.

కానీ దర్శకుడు కొరటాల విషయంలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అయితే ఫాన్స్ కు నమ్మకం రాలేదు అనిపిస్తోంది. అతను మొన్నటి వరకు వచ్చిన ఫార్ములాను మార్చకుంటే తప్ప కంటెంట్ కరెక్ట్ గా క్లిక్ కావడం కష్టం. ఇక మరోవైపు రాంచరణ్ పరిస్థితి అయితే మరింత ఊహించని విధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఒకప్పుడు ఎన్నో సందేశాత్మక చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన ఫార్ములా మాత్రం పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

దానికి తోడు ఇండియన్ 2 ఆగిపోవడం మళ్ళీ గేమ్స్ చేంజర్ షూటింగ్లో కూడా సడన్ గా బ్రేకులు పడడం కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం శంకర కమిట్మెంట్ ప్రకారం ఇండియన్ 2 పూర్తి చేసే పనులు బిజీ అయ్యాడు. ఈ తరుణంలో గేమ్ చెంజర్ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు పూర్తిస్థాయిలో తగ్గుతున్నాయి.

కనీసం సినిమా అప్డేట్ విషయంలో కూడా స్పీడ్ పెంచడం లేదు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అంతగా కట్టుకోలేదు. ఏదేమైనా కూడా RRR హీరోలిద్దరికీ కూడా దర్శకుల మీద కొంత ఎక్కువ టెన్షన్ అయితే పెరిగిపోతుంది. మరి ఆ టెన్షన్ దాటి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి


Recent Random Post: