ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’పై క్లారిటీ ఇచ్చిన మైత్రి!

Share


జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ అనే టైటిల్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ప్రదీప్ రంగనాథన్ సినిమా కూడా ఇదే పేరుతో రావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. దీనికి తోడు, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరును పెట్టడం మరింత సందేహాలను పెంచింది.

ఈ విషయంపై మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై రవిశంకర్ తాజాగా జరిగిన ఓ సక్సెస్ మీట్ లో స్పందించారు. రెండు వేరే వేరు సినిమాలు అని స్పష్టం చేస్తూ, తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ తో అంతర్జాతీయ స్థాయిలో భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు. అలాగే, ప్రదీప్ రంగనాథన్ మూవీని తక్కువ చేసి చూడడం లేదని, ఈ యూత్ స్టోరీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పక్కన పెట్టలేదన్న విషయం స్పష్టమైంది. అయితే, చివరి నిర్ణయం హీరో, దర్శకుడిదే అయినప్పటికీ, ఈసారి ‘దేవర’ కన్నా భారీ స్థాయిలో గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు రవిశంకర్ హింట్ ఇచ్చారు.

గతంలో పుష్ప 2 ప్రమోషన్ కోసం బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీలు అమలు చేసి ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ కోసం అంతకంటే పెద్ద ప్లాన్ సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం హీరో లేని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్న ప్రశాంత్ నీల్, ఈ షెడ్యూల్ పూర్తయ్యాక ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కథ పరంగా చూస్తే, 1960ల నేపథ్యంలో గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలువబడే సముద్ర తీర ప్రాంతంలోని డ్రగ్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌గా ఈ సినిమా ఉంటుందని లీక్ సమాచారం. ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో సెన్సేషన్ క్రియేట్ చేసే అంశాలను టచ్ చేసినట్లు టాక్.

ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, కేజీఎఫ్ – సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.


Recent Random Post: