యంగ్ టైగర్ ఫిట్నెస్ గురించి ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇలాంటి గుర్తింపు రావడం అన్నది సాధారణమైన విషయం కాదు. ఇక మార్చ్ 12న జరుగనున్న 95వ ఆస్కార్ వేడుకల్లో కూడా ఆర్.ఆర్.ఆర్ టీం పాల్గొంటుంది. సినిమా లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఇక యూఎస్ లో ఆర్.ఆర్.ఆర్ అనుభవాలను మీడియాతో పంచుకున్న రాజమౌళి ఎన్.టి.ఆర్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తారక్ తో అడివిలో సీన్ చేసేప్పుడు యాక్షన్ కొరియోగ్రాఫర్ ముందు ఆ స్టంట్ చేసి చూపించగా అతని కన్నా వేగంగా ఎన్.టి.ఆర్ పరుగెత్తాడని దాన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం కష్టం అనిపించిందని.
నటనలోనే కాదు ఫిట్ నెస్ లో కూడా ఎన్.టి.ఆర్ పర్ఫెక్ట్ అని అన్నారు రాజమౌళి. పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం వల్లే ఎన్.టి.ఆర్ అలా చేయగలుతున్నారని చెప్పారు రాజమౌళి.
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ అదరగొట్టేశారు. ఇప్పటికే భీం పాత్రలోని తారక్ నటనతో వరల్డ్ సినీ లవర్స్ అంతా ఫిదా అవగా ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ ఎన్.టి.ఆర్ ఇద్దరు పోటీ పడి మరీ నటించారు.
మెగా నందమూరి కాంబో సినిమా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆర్.ఆర్.ఆర్ తీశాడు రాజమౌళి. సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకుంటుంది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చరణ్ ఇద్దరు హీరోలు చేసే సినిమాల మీద హాలీవుడ్ ప్రేక్షకుల ఆసక్తి ఉండనుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా.. ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.
Recent Random Post: