
ప్రతిభావంతురాలైన నటి అయిన కంగన రనౌత్, తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందించిన రాజకీయ చిత్రం ఎమర్జెన్సీ చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం, ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత కుమీ కపూర్ రచించిన పుస్తకం ది ఎమర్జెన్సీ ఆధారంగా నిర్మించబడిందని చెబుతూ, ఆమె నోటీసులు జారీ చేశారు.
కుమీ కపూర్ ప్రకారం, కంగన మరియు ఆమె సోదరుడు అక్షత్, తన పుస్తకంలోని కొన్ని భాగాలు ఉపయోగించాలంటూ అభ్యర్థించి, పెంగ్విన్ పబ్లిషింగ్ కంపెనీతో త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే, ఒప్పందంలోని కొన్ని కీలక నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని, చారిత్రకమైన అనేక తప్పులు సినిమాలో చోటుచేసుకున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ నెల మొదట్లోనే లీగల్ నోటీసులు పంపించినప్పటికీ, ఇప్పటివరకు కంగన వైపు నుండి ఎలాంటి స్పందన రాలేదని రచయిత పేర్కొన్నారు. ఒప్పంద ప్రకారం రచయిత యొక్క రాతపూర్వక అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదనే నిబంధన ఉండగా, నెట్ఫ్లిక్స్ మాత్రం ‘ఈ చిత్రం కూమీ కపూర్, జయంత్ వసంత్ షిండే రచనల నుండి ప్రేరణ పొందింది’ అనే డిస్క్లైమర్ జతచేసి విడుదల చేసిందని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తీవ్ర ఆర్థిక నష్టాలనుండి సినిమా తీయడం కోసం కంగన తన ఆస్తులను తాకట్టు పెట్టినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఆ ఆస్తిని అమ్ముకుని అప్పులు తీర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సినిమాను పూర్తిచేయడంలోనే కాదు, రాజకీయంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
Recent Random Post:















