ఓటీటీ స్టార్స్ అంటే అంత చిన్న చూపా?

సినిమాల్లో అవ‌కాశాలు రానివారెంద‌రికో ఓటీటీ గొప్ప వేదిక‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఔత్సాహి కులు..ప్రతిభావంతులు అంటూ అదే వేదిక‌పై నిరూపించుకుని అక్క‌డ నుంచి వెండి తెర‌కి ప్ర‌మోట్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఓటీటీకి ఉన్న డిమాండ్ నేప‌థ్యంలో బిగ్ స్క్రీన్ మించి అక్క‌డ తారాగ‌ణమంతా ఫేమ‌స్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓటీటీలో ఎంత గొప్ప‌కంటెంట్ ప్రేక్ష‌కుల ముందుకొస్తుందో తెలిసిందే.

సినిమాల్ని మించిన గొప్ప ఎంట‌ర్ టైన్ మెంట్ని ఓటీటీ వేదిక‌లు అందిస్తున్నాయి. మూడు గంట‌ల సినిమా కంటే ఓటీటీ కంటెంటే? కింగ్ లా ఉందని భావిస్తున్న‌వారెంతో మంది. అగ్ర హీరోలు.. హీరోయిన్లే ఓటీటీలో పోటీ ప‌డుతున్నారు. త‌మ స్టార్ డ‌మ్ ని సైతం ప‌క్క‌న‌బెట్టి ఓటీటీతో వ‌ర‌ల్డ్ అంతా చుట్టేయోచ్చు అన్న కొత్త వ్యూహంతో క‌దులుతోన్న హీరోలెంతో మంది ఉన్నారు. అది నేడు మార్కెట్ లో ఉన్న ఓటీటీ క్రేజ్.

అయితే అలాంటి ఓటీటీ న‌టుల్నిబాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కాస్త కించ‌ప‌రిచిన‌ట్లే మాట్లాడింది. ఓటీటీ న‌టులు పెద్ద స్టార్లు కాద‌ని…. స్టార్ అనే ప‌దం త‌మ‌తో పాటు అంతం అవుతుందేమో అన్న భ‌యాన్ని వ్య‌క్తం చేసింది. కేవ‌లం సినిమాలు చేసిన హీరోయిన్లు మాత్రమే న‌టులు అంన్న‌ట్లు గా వ్యాఖ్యానించింది. ఓటీటీలో న‌టించే వారిని ఎవ్వ‌ర్నీ కూడా ఆయా సంస్థ‌లు స్టార్ల‌గా మార్చ‌లేక‌పో తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. అంటే కంగ‌న దృష్టిలో కేవ‌లం హిందీ సినిమాలు చేసే వారే స్టార్లా? మిగ‌తా వారు స్టార్లు కాదా? ఇదెక్క‌డి న్యాయం అంటూ ఆమెపై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన నీవు అలా మాట్లాడ‌టంఏమాత్రం స‌హేతుకంగా లేదంటున్నారు. ఓటీటీ న‌టుల్ని కంగ‌న త‌క్కువ చేసి మాట్లాడింద‌ని మ‌రికొంత మంది మండిప‌డుతున్నారు. ఇక కంగ‌న ర‌నౌత్ ఇంకా ఓటీటీ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్ట‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆమెత‌రం హీరోయిన్లుచాలా మంది ఓటీటీ సిరీస్లు చేస్తున్నారు.


Recent Random Post: