
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన కింగ్‌డమ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రౌడీ ఫ్యాన్స్ అయితే సినిమాపై సూపర్ హిట్ టాక్ ఇస్తున్నా, వసూళ్లు మాత్రం మోస్తరు స్థాయిలోనే ఉన్నాయి. అయినా కూడా విజయ్ గత కొన్ని చిత్రాలతో పోలిస్తే కింగ్‌డమ్ మెరుగైన ఫలితం సాధించిందనే చెప్పాలి. చిత్రబృందం ఈ సినిమాను కమర్షియల్ హిట్ అని చెబుతుండగా, ఆడియన్స్ రియాక్షన్ మాత్రం మిక్స్‌డ్‌గా ఉంది.
రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, నాగవంశీ తాజాగా ఒక ప్రత్యేక చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సినిమాలోని జైలు సీన్‌ను జెర్సీ మూవీలోని రైల్వే స్టేషన్ సీన్‌తో పోల్చుతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా విజయ్, “అక్కడ తమ్ముడు తన దగ్గరకు రావాలి అనే కోరికతో పోరాడుతాడు. ‘రండి రా’ అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ ఎమోషన్‌కే ఆ సీన్. దానికి జెర్సీ సీన్‌తో ఏమాత్రం పోలిక లేదు” అని చెప్పాడు.
ఇక కింగ్‌డమ్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, “కింగ్‌డమ్ 2 తప్పకుండా ఉంటుంది. అంతేకాదు 1920 కాలం నేపథ్యంలో ఉన్న కథను ఆధారంగా చేసుకుని ఒక ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పాడు. అసలు ఈ సినిమాకి మొదట దేవర నాయక అనే టైటిల్ ఆలోచించామనీ, కానీ ఎన్టీఆర్ సినిమా టైటిల్ దేవర కావడంతో, దానిని కింగ్‌డమ్గా మార్చామని విజయ్ వెల్లడించాడు.
మొత్తం కింగ్‌డమ్ సిరీస్‌లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు ప్లాన్‌లో ఉన్నాయన్న మాట. అయితే విడుదలకు ముందు గౌతమ్ తిన్ననూరి ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనకపోవడం, రిలీజ్ తర్వాత కూడా ఆయన ఎక్కడా కనిపించకపోవడంపై ప్రేక్షకులు ప్రశ్నలు వేస్తున్నారు.
సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, ఆమెకు వచ్చిన స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉందని అభిమానులు అంటున్నారు. ఆమెపై ఉన్న “హృదయం లోపల” పాటను కూడా పొడవు కారణంగా, సినిమా ఫ్లో డిస్టర్బ్ అవుతుందని తీసేశారని మేకర్స్ చెబుతున్నారు.
మొత్తం మీద, కింగ్‌డమ్ విజయవంతమైతే సీక్వెల్స్, ప్రీక్వెల్‌తో రాబోయే రోజుల్లో ఈ కథ మరింత విస్తరించబోతోందని విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చాడు.
Recent Random Post:















