కింగ్‌డమ్‌ హిట్‌తో ఆనందంగా ఉన్న విజయ్ దేవరకొండ – నాగ వంశీ

Share


విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి చాలా సంతోషంగా ఉందని నిర్మాత నాగ వంశీ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించిన ఆయన, సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుందని, ఫ్యాన్స్ కోరుకున్న హిట్‌ను అందించగలిగామని ఆనందం వ్యక్తం చేశారు.

“హైదరాబాద్‌లోనే 32 షోలు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. 2025లో ఇంత హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, హాలీవుడ్ స్థాయిలో తీసిన సినిమా ఇంకొకటి లేదు. ‘కింగ్‌డమ్’ మేకింగ్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 100% పర్ఫెక్ట్ సినిమా ఎప్పుడూ ఉండదు, కొన్ని చిన్న ఫ్లాస్ ఉంటాయి. మా సినిమాకి కూడా సెకండ్‌ హాఫ్‌లో కొంచెం డ్రాగ్‌ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు కూడా దాన్ని బాగా అంగీకరించారు,” అని నాగ వంశీ తెలిపారు.

ఇక సినిమాలోని పాటల గురించి మాట్లాడుతూ – “సినిమా సీరియస్ నెస్ బ్రేక్ అవుతుందని భావించి ‘హృదయం లోపల’ సాంగ్‌ను తీసేశాం. ఆ పాట సెకండ్‌ హాఫ్‌లో ఉంటే బాగుండేది, కానీ సినిమా ఫ్లోకి అంతరాయం కలిగిస్తుందని మేం దానిని తొలగించాం,” అన్నారు. క్లైమాక్స్‌ సీన్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా చెప్పారు.

విజయ్ దేవరకొండ కూడా సినిమాకు వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ – “అర్జున్ రెడ్డి టైమ్‌లో ఎలా ఫ్రెండ్స్‌తో చిల్ అయ్యేదాన్నో, చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి ఫీలింగ్ వచ్చింది. నిన్న రాత్రి 10 గంటల నుండి యూఎస్‌లో షోలు మొదలైనప్పటి నుంచి ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. అందరూ హిట్ అయిందని చెబుతున్నారు,” అని అన్నారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన **‘కింగ్‌డమ్’**లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, అనిరుద్‌ అందించిన సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది.


Recent Random Post: