కిర్లంపూడి: ముద్రగడ ఇంటిపై ట్రాక్టర్ దాడి, జనసేన అనుమానాలు

Share


కిర్లంపూడి పేరు వింటేనే కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో తనదైన శైలితో సాగిన ముద్రగడ ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ, తన పేరు చివర ‘రెడ్డి’ అన్న ట్యాగ్ జోడించుకున్నాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడటానికి ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నా, అవి అంతగా ఫలించలేకపోయాయి.

ఇలాంటి సమయంలో, ఆదివారం తెల్లవారుజామున కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంపై ఓ అపరిచిత యువకుడు ట్రాక్టర్ తో దూసుకువచ్చి, ఇంటి ర్యాంపుపై నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడు “జై జనసేన” అనే నినాదం చేసే విషయం, ఈ దాడి జనసేన పార్టీ మద్దతుతో జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేయిస్తున్నాయి.

ఈ సంఘటన తెలిసిన వెంటనే, ముద్రగడ అభిమానులు, ముఖ్యంగా కాపు నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్ద చేరుకున్నారు. వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడి చర్యపై నిరసన ప్రదర్శించారు. పోలీసులు, అప్రమత్తంగా అక్కడ చేరుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే, ముద్రగడ అభిమానుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తత పెరిగింది.


Recent Random Post: