
కీర్తి సురేష్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న, పెద్ద అని తేడా చూడకుండా వచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరించడం ఆమె శైలి. నటిగా అన్ని రకాల పాత్రలను పోషించడం కావాలని, ఏ పాత్రకైనా తగిన న్యాయం చేయాలని నిశ్చయించుకుంది. ప్రస్తుతానికి తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కీర్తి, కొన్నిసార్లు తారసపడే కొన్ని పాత్రలు మాత్రం నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతోంది.
తాజాగా ఆమె ‘ఉప్పు కప్పు రంబు’ సినిమాలో అపూర్వ అనే పాత్రలో కనబడనుంది. ఈ పాత్ర తన రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటుందని కీర్తి చెబుతోంది. నిజ జీవితంలో తానెంత అమాయకురాలో ఇంట్లో వాళ్లు ఎప్పుడూ చెప్పేవారట. అది ‘ఉప్పు కప్పు రంబు’లోని అపూర్వ పాత్రకూ సరిపోతుందని ఆమె తెలిపింది. ఈ రోల్ నవ్వించే రకమని, “ఒకరిని ఏడిపించడం సులభం కానీ నవ్వించడం చాలా కష్టమని” కీర్తి విశ్వసిస్తుందట.
“ఈ సినిమా కన్నా ముందు ‘రఘుతాత’ చేశాను. అది కూడా రకరకాల వినోదంతో నడిచే చిత్రం. ప్రయోగాలు చేయాలంటే ఆసక్తి ఉండాలి. విభిన్న కథా నేపథ్యాలున్న సినిమాలు చేయాలనుకోవడమే ‘ఉప్పు కప్పు రంబు’ని అంగీకరించడం వెనక కారణం” అని కీర్తి తెలిపింది.
“కామెడీ నాకు రాకపోయినా, ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. ఊర్లో పెద్ద బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని, సమస్యలను ఎలా పరిష్కరించింది అనేది ఈ సినిమా కథ” అని కీర్తి సురేష్ షేర్ చేసింది.
Recent Random Post:















