కుటుంబ ఐక్యత కోసం మనోజ్ భావోద్వేగం

Share


ఇటీవల మంచు కుటుంబంలో చోటుచేసుకున్న అన్నదమ్ముల మధ్య విభేదాలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఈ వివాదంలో తన తండ్రిని అనవసరంగా లాగాల్సివచ్చిందని మంచు మనోజ్ ఎప్పటికప్పుడు బాధ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది కేవలం అన్నదమ్ముల మధ్య పరస్పర అభిప్రాయ భేదమేనని చెబుతున్న మనోజ్, కుటుంబానికి మళ్లీ ఐక్యత రావాలని ఆకాంక్షతో ఉన్నాడు.

ఈ క్రమంలో, భైరవం సినిమా ప్రమోషన్ల సందర్భంగా మనోజ్ చాలా భావోద్వేగంగా స్పందించాడు. “నా కుటుంబం మళ్లీ ఒకచోట చేరి కలిసి భోజనం చేయాలి. ఆ సన్నివేశాన్ని ఒకసారైనా చూడాలి. నాన్న గారు నా పాపను ఒడిలో ఎత్తుకుని ప్రేమగా మాట్లాడిన రోజు కోసం ఎదురు చూస్తున్నాను,” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తన తండ్రిపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేసిన మనోజ్, తన తల్లిని కలవడానికి, మాట్లాడడానికి కూడా నిబంధనలు పెట్టారని వాపోయాడు. “అమ్మను ఇంటి బయటే కలవాలి, ఏం మాట్లాడాలో కూడా చెప్పాలి – ఇది ఒక కొడుక్కి తట్టుకోలేని బాధ. అలాంటి పరిస్థితేనా?” అంటూ ప్రశ్నించాడు.

ఈ గొడవల కారణంగా తనకు ఎంతో ప్రీతిపాత్రమైన అక్కతో దూరమయ్యామని, ఆమె ప్రారంభించిన ‘టీచ్ ఫర్ ఏ ఛేంజ్’ కార్యక్రమానికి రావాలో లేదో అనుమానంగా ఉండేదాన్నని, కానీ చివరకు ఆమె కోసం హాజరయ్యానని తెలిపాడు.

ఇక తన భార్య మౌనిక విషయానికి వస్తే, ఆమె తల్లిదండ్రులను కోల్పోయిన బాధలో ఉండటం, జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుండటాన్ని మనోజ్ మనస్పూర్తిగా వివరిస్తూ, “మౌనికను అనవసరంగా ఈ గొడవల్లోకి లాగొద్దు. మేమెప్పుడూ ఎవరి ఆస్తుల మీద కన్నేసిన వాళ్లం కాదు” అని స్పష్టం చేశాడు.

“నన్ను, నా భార్యను, నా బిడ్డలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను కూడా కత్తి పట్టాల్సి వచ్చింది,” అంటూ మనోజ్ మాట్లాడుతూ తన బాధను పంచుకున్నాడు.

ఈ మాటల్లో మనోజ్ వ్యక్తిత్వంలో ఉన్న నిజాయితీ, ప్రేమ, బాధ్యత స్పష్టంగా కనిపించాయి. తన కుటుంబం తిరిగి ఒక్కటైపోవాలని, మళ్లీ అందరూ ప్రేమగా కలుసుకునే రోజుని ఎదురుచూస్తున్న మనోజ్ ఆకాంక్ష అందరి మనసులను తాకుతుంది.


Recent Random Post: