కేన్స్ రెడ్ కార్పెట్‌పై జాన్వీ భావోద్వేగం

Share


ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ వేదికపై మొదటిసారి మెరిసిపోయింది బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌. లైట్‌ పింక్‌ డిజైనర్‌ ఔట్‌ఫిట్‌లో రాత్రి రాగానే రెడ్‌ కార్పెట్‌ పై వాక్‌ చేసిన జాన్వీ తన నాజూగైన అందంతో అంతర్జాతీయ మీడియాను కూడా ఆకట్టుకుంది. పెద్దగా స్కిన్‌ షో లేకుండా సొగసైన తీరిగతితో కనిపించిన జాన్వీ… ఫోటోగ్రాఫర్ల కళ్లను తనవైపు తిప్పుకున్నది.

ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో స్పెషల్‌ అనుభూతినిచ్చిందని జాన్వీ చెబుతోంది. తన తండ్రి బోనీ కపూర్‌ మరియు సోదరి ఖుషీ కపూర్‌ తో కలిసి ఈ ఫెస్టివల్‌కు హాజరైన జాన్వీ, ఈ సంతోషకరమైన సందర్భంలో తల్లి శ్రీదేవి లేరు అనేది తనకు చాలా బాధ కలిగించిన విషయమని హృదయాన్ని తడిపేలా చెప్పింది.

“మా అమ్మ ఎన్నో విజయాలు సాధించారు. కుటుంబాన్ని ఆమె ఆనందాల్లో భాగం చేసేవారు. చిన్నప్పుడు నాలుగు సార్లు సమ్మర్‌ హాలిడేస్‌కి కేన్స్‌ కు తీసుకెళ్లింది. కానీ ఈసారి నేను రెడ్‌ కార్పెట్‌ పై నడిచే సమయానికి అమ్మ పక్కన లేకపోవడం మనసు బాధిస్తోంది. ఈ విజయం ఆమెకు అంకితం” అని భావోద్వేగంగా చెప్పింది జాన్వీ.

కేన్స్‌లో స్క్రీనింగ్‌ అయిన జాన్వీ తాజా చిత్రం ‘హోమ్‌ బౌండ్‌’ మంచి ప్రశంసలు అందుకుంటోంది. పల్లెటూరి యువతిగా విభిన్న పాత్రలో నటించిన జాన్వీ, తన నటనలో కొత్త కోణం చూపించిందని దర్శకుడు కూడా అభిప్రాయపడ్డారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని జాన్వీ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా, జాన్వీ తెలుగులోనూ తన పరిచయాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్దిది అనే సినిమాలో నటించనుంది. త్వరలో ప్రారంభం కానున్న అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌ సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


Recent Random Post: