చికిరి దుమ్ముతో పెద్ది‌పై ఆకాశాన్నంటుతున్న అంచనాలు

Share


ఉప్పెన తర్వాతే రెండో సినిమాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో అవకాశం అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఈ ఛాన్స్‌ను అసలు వదులుకోకుండా బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి శతవిధాలా కృషి చేస్తున్నాడు. చరణ్–బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా రాంగస్థలం తరహాలోనే, కానీ పూర్తిగా భిన్నమైన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.

సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హల్‌ఛల్ చేస్తోంది. చరణ్ స్టెప్పులు ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించగా, రీల్స్ పరంగా కూడా ఈ సాంగ్ దుమ్ము లేపుతోంది.

పెద్ది సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించటం ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే చికిరి బ్లాక్‌బస్టర్ కాగా, రాబోతున్న సాంగ్స్ కూడా అదే స్థాయిలో, మరింత హైప్‌తో ఉంటాయని టీమ్ చెబుతోంది. చికిరి కేవలం సాంపిల్ మాత్రమే… సినిమాలో చరణ్ డ్యాన్స్ చేసిన ఇతర సాంగ్స్ విజువల్‌గా కూడా నెక్స్ట్ లెవెల్ అని బజ్.

హీరోయిన్‌గా జాన్వి కపూర్ నటిస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. చరణ్ ఎనర్జీ, రెహమాన్ మ్యూజిక్, జాన్వి గ్లామర్—ఈ కాంబినేషన్‌ను ఆపటం అసాధ్యం అని అభిమానుల ఫీలింగ్.

పెద్ది కథ, టేకింగ్ ఒక లెక్క అయితే—సాంగ్స్‌లో చరణ్ డ్యాన్స్ అల్లరి మరో లెక్క అంటూ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. చికిరి ఇచ్చిన జోష్ వల్లే సినిమా నుంచి వచ్చే ప్రతి సాంగ్ పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.


Recent Random Post: