
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో దూసుకెళ్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అగ్ర హీరోగా తన సత్తా చాటుతూ వరుస సినిమాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ విజువల్ వండర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో చిరు బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, విశ్వంభర తర్వాత చిరంజీవి మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులను ఫైనలైజ్ చేశారు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్లాన్ చేయగా, మరొకటి దాస్ కా ధమ్కీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనుంది.
ఈ రెండింటిలో ముందుగా చిరు, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి నిర్మించనున్న ఈ సినిమా ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదే కాకుండా, చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయం అందించిన డైరెక్టర్ బాబీ కొల్లితో మళ్లీ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. బాబీ చిరంజీవి కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని, ఇప్పటికే వీరి మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ ఉగాది సందర్భంగా చిరు-బాబీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Recent Random Post:















