చిరు, చరణ్‌ ‘బ్రో డాడీ’ చేయాలి

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘బ్రో డాడీ’ ని రీమేక్ చేయాలి అనుకున్నాడు. మోహన్ లాల్‌ పోషించిన పాత్రను చిరంజీవి పోషించేందుకు రెడీ అయ్యాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, మెగాస్టార్‌ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ ను కూడా రెడీ చేశాడు అనే వార్తలు వచ్చాయి.

భోళా శంకర్ సినిమా నిరాశ పరచడంతో పాటు, బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లు అవ్వడం వల్ల విమర్శలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో చిరంజీవి బ్రో డాడీ సినిమా రీమేక్ ను పక్కన పెట్టి విశ్వంభర సినిమా ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. దాంతో బ్రో డాడీ గురించి తెలుగు మీడియా లో చర్చ కు ఫుల్ స్టాప్ పడింది.

చాలా రోజుల తర్వాత మళ్లీ బ్రో డాడీ సినిమా గురించి, దాని తెలుగు రీమేక్ గురించిన చర్చ జరుగుతోంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బ్రో డాడీ లో మోహన్‌ లాల్‌ కొడుకు గా నటించిన విషయం తెల్సిందే. ఆయన తెలుగు మీడియా ముందు తెలుగు లో బ్రో డాడీ రీమేక్ చేస్తే బాగుంటుందని అన్నాడు.

తన గోట్‌ లైఫ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ… తెలుగు లో బ్రో డాడీ సినిమాను చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుంది. రామ్‌ చరణ్ గారు కూడా ఈ రీమేక్ లో నటిస్తే అద్భుతంగా ఉంటుందని తన అభిప్రాయం అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

బ్రో డాడీ రీమేక్ ను పూర్తిగా పక్కకు పెట్టలేదని, భవిష్యత్తులో చిరంజీవి కచ్చితంగా చరణ్ తో కలిసి కాకున్నా మరో హీరోతో అయినా ఆ రీమేక్ ను చేస్తాడు అంటూ ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంభర సూపర్‌ హిట్‌ అయితే బ్రో డాడీ పట్టాలెక్కే అవకాశం ఉందేమో చూడాలి.


Recent Random Post: