చైతూతో మ‌సుద దెయ్యం ఫోటో.. నెట్టింట వైర‌ల్

Share


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుతూ, స్టడీగా రన్ అవుతోంది.

సినిమా తర్వాత సక్సెస్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నాగ చైతన్యకు తండేల్ భారీ విజయాన్ని అందించింది. ఈ ఆనందాన్ని వేడుకగా మార్చుకుంటూ, చైతన్య ఫిల్మ్ నగర్‌లోని ఓ పబ్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు.

ఈ ప్రత్యేక సెలబ్రేషన్‌కు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ పార్టీలో నాగ చైతన్యతో కలిసి ఓ యువతి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ యువతి మరెవరో కాదు, “మసూద” సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన బాంధవి శ్రీధర్.

మసూద సినిమాలో దెయ్యంలా కనిపించినా, నిజజీవితంలో మాత్రం బాంధవి తన గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. 2019లో మిస్ ఇండియా రన్నరప్, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ గెలుచుకున్న బాంధవి, మసూద సినిమాతో పెద్ద గుర్తింపు తెచ్చుకుంది.

ఈ విజయం తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇప్పుడు నాగ చైతన్య ఇచ్చిన స్పెషల్ పార్టీలో మెరిసి మళ్లీ ట్రెండ్ అవుతోంది.

ఈ గ్రాండ్ పార్టీలో నిర్మాతలు స్వప్న, నాగ వంశీ, అల్లు అరవింద్, బన్నీ వాస్, సుప్రియ, బాపినీడు తదితరులతో పాటు దర్శకుడు కార్తీక్ దండు, గీతా ఆర్ట్స్ టీం హాజరయ్యారు.


Recent Random Post: