చైతూ.. అందరి మనసులు దోచేశావ్!

అక్కినేని నాగచైతన్య.. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన జోనర్లను టచ్ చేస్తూ అలరిస్తున్నారు. సినీ ప్రియులను మెప్పించడమే ధ్యేయంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. తన యాక్టింగ్ స్కిల్స్ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా రిలీజ్ కన్నా ముందే ఇప్పుడు అందరి మనసులు దోచుకున్నారు!

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నారు. నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. కైండ్ హార్టెడ్ అంటూ ఆయనను అక్కినేని అభిమానులు కొనియాడుతున్నారు. హోనెస్ట్ నెస్ కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. స్టార్ కిడ్ అయినా.. రియాలిటీగా మాట్లాడారని అంటున్నారు. ఎలాంటి యాటిట్యూడ్ చూపించకుండా కూల్ గా ఉంటూ.. చిన్న సినిమా టీమ్ లో కాన్ఫిడెన్స్ నింపారని చెబుతున్నారు. అప్ కమింగ్ మూవీ ‘క’ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేస్తున్నారు.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరగ్గా.. చీఫ్ గెస్ట్ గా నాగచైతన్య విచ్చేశారు. వేడుక అంతా చాలా ఓపిగ్గా కూర్చున్న ఆయన.. అద్భుతంగా మాట్లాడారు. అప్పటికే కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా రివీల్ చేసిన తన జర్నీని ప్రస్తావించారు. కిరణ్ పోరాడిన విధంగా తాను ఎప్పుడూ కష్టపడలేదని తెలిపారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ కిరణ్ స్ఫూర్తి అని చైతూ కొనియాడారు.

“నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఎంతో సపోర్ట్, ప్రొటక్షన్ తో, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చాను. కొన్ని స్టోరీస్ ను కేవలం వినగలుగుతాను. కానీ ఆ కష్టమేంటో జీవితంలో ఎప్పటికీ నాకు తెలియదు. ఆ స్టోరీస్ వింటూ ఇన్స్పైర్ అవుతాను. నేను హోనస్ట్ గా చెబుతున్నాను. కిరణ్ జర్నీకి నేను ఫ్యాన్ ను. నేనే కాదు.. చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి కిరణ్ జర్నీ వంటి స్టోరీస్ హోప్ ఇస్తాయి” అని తెలిపారు.

“క మూవీ అంటే.. కిరణ్ అబ్బవరం సినిమానా అంటున్నారు. కిరణ్.. నిన్ను హీరోగా అంతా రికగ్నైజ్ చేస్తున్నారు. అలాంటి గుర్తింపు సంపాదించుకున్నావ్. సో ఇన్సపైరింగ్ కిరణ్. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ ఇంటర్య్వూలు చూశాను. చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ ఎదుర్కొన్నావ్. దానిని ఒకరకమైన ర్యాగింగ్ గా చెప్పవచ్చు. ఆ సమయంలో ఎంతో మెచ్యూర్ గా డీల్ చేశావ్. నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్. ట్రోలర్స్ కు బ్రెయిన్ లో ఏం ఉండదు” అంటూ కౌంటర్ ఇచ్చారు.

“జీవితంలో ఎత్తుపల్లాలు సహాజం. నీది చాలా ఎమోషనల్ జర్నీ. ‘క’ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ. టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో కళ్ల ముందు కనిపిస్తోంది. నేను నీ ఫ్యాన్ ను కిరణ్. నీ జర్నీ అమెజింగ్. ఎందరికో ఆదర్శం. లవ్ యూ బ్రదర్” అంటూ తన ప్రేమను బయటపెట్టారు. అలా చైతూ మాట్లాడిన మరు క్షణం నుంచే సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బెస్ట్ అండ్ హానెస్ట్ స్పీచ్ అని చెబుతున్నారు.

అయితే చైతూ సాధారణంగా చాలా సింపుల్ అండ్ హోనెస్ట్ గా కనిపిస్తుంటారు. వివాదాల జోలికి వెళ్లరు. తనకు సంబంధించిన విషయాల్లో కూడా హుందాగా డీల్ చేస్తారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగనట్లు మాట్లాడుతారు. ఇప్పుడు తన జెన్యూనిటీని క మూవీ ఈవెంట్ లో చూపించారు. స్టార్ కిడ్ అయినా ఒక హీరో కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించారు. అక్కినేని లెగసీని కాపాడారు. అందుకే సో స్వీట్ ఆఫ్ యూ నాగ చైతన్య అని అంటున్నారు అంతా!


Recent Random Post: