సుహాస్- చాందినీ చౌజరి జంటగా సందీప్ రాజ్ తెరకెక్కించిన `కలర్ ఫోటో` జాతీయ అవార్డు సొంతం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సినిమా కమర్శియల్ గా విజయం సాధించలేదు గానీ నేషనల్ అవార్డు రావడంతో ఫేమస్ అయింది. ఈ సినిమాకు పనిచేసిందంతా కొత్త వారే. అయినా జాతీయ స్థాయిలో కలర్ ఫోటో పేరు మారు మ్రోగింది.
అటుపై `కలర్ ఫోటో` టీమ్ ని టాలీవుడ్ పెద్దలు సత్కరించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ సినిమా లో ఛాన్స్ ఇస్తే గనుక మెగా డాటర్ నిహారిక వదులుకునేదాన్ని కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ` నటిగా నేనెప్పుడు కథలకే ప్రాధాన్యత ఇస్తాను. చిన్న పాత్ర, చిన్న హీరో అనే ది ఉండదు. కాకపోతే కొంత మంది దర్శకులు నేను నాయికా ప్రాధాన్యమున్న కథలే చేస్తానని, చిన్న హీరోల సరసన నటించనని అనుకుంటున్నారు.
ఆ అనుమానంతోనే చాలా మంది చిన్న దర్శకలు నాకు కథలు వినిపించడం లేదు. అప్పట్లో సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాకి నన్ను అనుకున్నారుట. కానీ సుహాస్ లాంటి చిన్న నటుడి సరసన చేస్తానా? లేదా? అన్న ఉద్దేశంతో తీసుకోలేదుట. అసలు ఆ కథ నావరకూ వస్తే చేస్తానా? లేదా? అన్నది తెలుస్తుంది. అందుకే ప్రస్తుతానికి తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టా. అక్కడైతే ఆ ప్రభావం ఉండదు కదా` అని తెలిపింది.
మొత్తానికి నిహారిక చిన్న హీరోలకు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందన్నది అర్దమవుతుంది. ఆమె మాటలు నిజమే. చాలా మంది దర్శకులు మెగాఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అన్నిసినిమాలు చేస్తుందా? లేదా? అన్న సందేహం చాలా మంది మేకర్స్ లో ఉంది. ఆ కారణంగా చాలా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఓపెన్ అయిన నేపథ్యంలో నిహారిక ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.
Recent Random Post: