
ఇటీవల తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ఓటీటీ ప్రేక్షకుల కోసం మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ఎప్పుడూ సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉండే ఆయన తాజా వెబ్ సిరీస్ ‘హోం టౌన్’, ఈ వారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. #90’s బయోపిక్ మేకర్స్ నిర్మించిన ఈ సిరీస్ ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల అంచనాలను మించేలా సిరీస్ ఉంటుందని, తన పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని రాజీవ్ కనకాల తెలియజేశారు.
తాజా ఇంటర్వ్యూలో, తాను పని చేసిన ప్రముఖ దర్శకుల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “**ఎస్.ఎస్. రాజమౌళి తనకు కావాల్సిన షాట్ వచ్చే వరకు వదిలిపెట్టడు. చాలా సమయం పట్టినా సరే, అవసరమైతే అరవగానే అయినా కావాల్సినట్టుగా తీసుకుంటాడు. కానీ శేఖర్ కమ్ముల మాత్రం పూర్తి భిన్నం. ఆయన కూడా తనకు కావాల్సిన షాట్ వచ్చే వరకు వదిలిపెట్టడు, అయితే అరవకుండా, చాలా కూల్‌గా నటీనటులను డైరెక్ట్ చేస్తాడు. తన స్టైల్‌లో మెల్లిగా మెచ్చుకుంటూ, జుట్టు పీక్కుంటూ ‘మరి ఒకసారి ట్రై చేద్దాం, ఇంకాస్త ఇలాగైతే బాగుంటుంది’ అంటూ నటులను కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాడు” అని చెప్పారు.
అలాగే, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి మాట్లాడుతూ, “ఆయన నటీనటులపై పూర్తిగా నమ్మకంతో ఉంటారు. ముందుగా నటుడు ఎలా అనుకుంటే అలా చేయమంటారు. అది బాగుంటే తీసుకుంటారు, లేకపోతే తాను అనుకున్నట్లు మార్పులు చేసి మళ్లీ ట్రై చేయమంటారు. ఆయన స్టైల్ పూర్తిగా నచ్చేలా, కన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉంటుంది” అని వివరించారు.
తాజాగా, ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “90’s బయోపిక్ లాగే, ఈ సిరీస్ కూడా ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు మంచి అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు. ఈ సిరీస్‌లో ప్రజ్వల్, ఆనీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినోదాన్ని, భావోద్వేగాలను సమపాళ్లలో కలిపిన ఈ ఎంటర్‌టైనర్ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది.
Recent Random Post:















