జపాన్‌లో ఎన్టీఆర్ ఫీవర్ – ‘దేవర’కు భారీ క్రేజ్!

Share


‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఎన్టీఆర్‌కి జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా జపనీస్ అభిమానులు, అందులోనూ లేడీ ఫ్యాన్స్, ఎన్టీఆర్‌పై తమ అభిమానం చూపిస్తూ వీడియోలు చేస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని వీడియోల్లో వారు ఎన్టీఆర్ కటౌట్‌లతో సంతోషాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ను జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 28న జపాన్‌లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.

ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో కలిసి ప్రత్యేకంగా వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా తొలి రోజు ప్రివ్యూ థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘దేవర’ సినిమాపై ఆసక్తికర చర్చలు జరిపాడు. అంతేకాక, ‘దేవర’లోని ‘ఆయుధ పూజ’ పాటకు స్టేజ్ మీద డాన్స్ చేయడం అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్‌ అవుతోంది. అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి ఎన్టీఆర్ మరింత ఉత్సాహంతో ప్రమోషన్స్ కొనసాగిస్తున్నాడు.

ఇక ఎన్టీఆర్ రెండో రోజు మరింత స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆయన తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల వరుస సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. జపాన్‌లోని అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు ఎన్టీఆర్ తన స్టైలిష్ అవతార్‌తో మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ జపాన్‌లో భారీ విజయాన్ని సాధించడంతో, ‘దేవర’ ఆ స్థాయిని మించేలా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోటీ లేకపోవడం, భారీ స్క్రీన్ కౌంట్‌లో సినిమా విడుదలవడం లాంటి అంశాలు సినిమాకు కలిసొచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు జపాన్‌లో విడుదలైన తెలుగు సినిమాల కంటే ‘దేవర’కి ముందస్తు టాక్‌, బజ్ ఎక్కువగా ఉందని అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత జపాన్ మార్కెట్‌లో ఇది ఎలాంటి సంచలన రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.


Recent Random Post: