జపాన్ మంత్రి.. తారక్ గురించి ఏమన్నారంటే..

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి లో అందరికీ రీచ్ అయిందని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రం తో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు. నెట్ ఫిక్స్ ద్వారా ఈ సినిమా ని ఇతర దేశాల వారు కూడా వీక్షించారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ మీడియా లో చూశారు.

ఇక ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో ఒక్కసారిగా అందరూ దృష్టి వీరి పై పడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లోనే భారీ బడ్జెట్ తో కంప్లీట్ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పిరియాడికల్ ఫిక్షనల్ కాన్సెప్ట్ తో దేవర మూవీ ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా మూవీలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియా లోనే కాకుండా జపాన్ దేశం లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జపాన్ లో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ సినిమా లోని రామ్ చరణ్ తారక్ క్యారెక్టర్లకు జపాన్ సినీ ప్రేమికులు బాగా కనెక్ట్ అయిపోయారు.

తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఇండియా జపాన్ సమ్మిట్ లో ఆ దేశ విదేశాంగ మంత్రి యోషిమాష హయూషి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని పేర్కొన్నారు. ఆ సినిమా ని ఫుల్ గా ఎంజాయ్ చేసానని, మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కి తను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని ని మరింతగా షేర్ చేస్తూ ఉన్నారు. తమ అభిమాన హీరో గొప్పతనం గురించి కామెంట్లు పెడుతున్నారు. దేవర సినిమా తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ హాలీవుడ్ స్థాయికి రీచ్ అవ్వడం ఖాయమని అంటున్నారు.


Recent Random Post: