
సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, వీరి వ్యక్తిగత మరియు కెరీర్ సంబంధిత వార్తలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. సాధారణంగా పాజిటివ్ వార్తలకు పెద్దగా పట్టించుకోరు, కానీ నెగటివ్ వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతూ సెలబ్రిటీలకు మరియు వారి కుటుంబ సభ్యులకు అసహనాన్ని కలిగిస్తాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు, బ్రతికున్న వారిని చనిపోయినట్టు చిత్రీకరిస్తూ, కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిలిస్తుంటారు.
ఇటీవల ఈ పరిస్థితి హీరో ధర్మేంద్ర విషయంలో కూడా జరిగింది. ఆయన రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ వెళ్లడంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ మొదట వార్తలు వచ్చాయి. తరువాత సోషల్ మీడియాలో ఆయన చనిపోయారు అని వార్తలు ప్రచారం అయ్యాయి. ధర్మేంద్ర కుటుంబం, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తన సానుభూతిని వ్యక్తం చేశారు. దీంతో ధర్మేంద్ర కూతురు, ఆయన ఇంకా క్షేమంగా ఉన్నారని స్పష్టంచేసి, అందరిని ఆశ్చర్యపరిచింది. నిజానికి, ధర్మేంద్ర నవంబర్ 24న అనారోగ్య సమస్యల కారణంగా దివంగతులయ్యారు.
ఇక తాజాగా, దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా సోషల్ మీడియా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో, తల్లి మరణ సమయంలో కొన్ని మంది సరదాగా మీమ్స్ చేయడం, విషయంలో వినోదంగా వ్యవహరించడం చూశానని, అలాగే ఇటీవల ధర్మేంద్ర ఆరోగ్యం గురించి తప్పు వార్తలు, ఊహగానాలు ప్రచారం చేయడం సోషల్ మీడియా వినియోగదారుల అత్యుత్సాహం అని విమర్శించారు.
జాన్వీ కపూర్ బ్రతికున్న వారిని చనిపోయినట్టు చిత్రీకరించడం పై కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతోంది మరియు వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.
Recent Random Post:














