
బాలీవుడ్‌లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుల్లో జాన్ అబ్రహాం ఒకరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా ఎదిగిన అతడు, ఇండస్ట్రీలో పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. మంచి హిట్ సినిమాలతో స్టార్‌డమ్‌ను దక్కించుకున్నాడు.
అయితే జాన్ వ్యక్తిగత జీవితం కూడా చాలా మందికి ఆసక్తికరమైనదే. ఒకప్పుడు సహనటి బిపాషా బసుతో దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసినప్పటికీ, ఎప్పుడూ పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకోవాలన్న ఆలోచన లేదు. కొన్నాళ్లకే వారి రిలేషన్ ముగిసిపోయింది.
తర్వాత ప్రియా రుంచల్ అనే ఫైనాన్షియల్ అనలిస్టును ప్రేమించి, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయి 11 ఏళ్లు దాటినా కూడా జంటకు ఇప్పటికీ పిల్లలు లేరు. దీని గురించి తరచూ మీడియా, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన జాన్… “ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ మీద ఉంది. నా సంస్థలు, నిర్మాణ కంపెనీ, ఫుట్‌బాల్ టీమ్ (నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC) అన్నీ నా సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయి. కుటుంబాన్ని పెంచుకునే ఆలోచనకు ఇప్పట్లో టైమ్ రావడం లేదు” అన్నారు.
అలాగే, “నేను పరిపూర్ణ వ్యక్తిని కాదు. నా భార్య ప్రియా ఎంతో సహనంతో, తెలివిగానే వ్యవహరిస్తుంది. ముందుగా నా బిజినెస్ వ్యవస్థలను స్థిరపరిచి, తర్వాతే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను” అన్నారు జాన్.
ప్రస్తుతం జాన్ అబ్రహాం సినిమాలు, నిర్మాణ కార్యక్రమాలతో పాటు వ్యాపారాల విస్తరణలో బిజీగా ఉన్నాడు. చివరిసారిగా ‘ది డిప్లొమాట్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.
Recent Random Post:















