
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ మృతి విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీవ్ర విచారణను కొనసాగిస్తోంది. అస్సాం పోలీస్ సిట్ గురువారం మరో సంచలన నిర్ణయంతో సమచారం బయటకు వచ్చింది. గార్గ్ మ్యూజిక్ బ్యాండ్‌లో కీలక సహచరుడు శేఖర్ జ్యోతి గోస్వామి మరియు సహ-గాయకుడు అమృత్ప్రవ మహంతను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం నాలుగు మందిని అరెస్ట్ చేసి విచారణలోకి తీసుకోవడం ఇప్పుడు చర్చకు కారణమైంది.
సింగపూర్ విహారయాత్రలో గార్గ్ ఒక యాచ్ పార్టీలో ఈతకు వెళ్లగా, నీటిలో మునిగి మరణించినట్లు కథనాలు వచ్చాయి. సిట్ దీనిని అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 19న నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ సందర్భంగా జరిగిన యాచ్ పార్టీలో గోస్వామి మరియు మహంత ఇద్దరూ గార్గ్‌తో ఉన్నారని తెలిపినట్లు అధికారులు తెలిపారు. గార్గ్ ఈతకు వెళ్లిన తర్వాత బయటకు రాకపోవడంతో, తేలుతూ కనిపించారని సమాచారం ఉంది.
ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. గోస్వామి వీడియోలలో గార్గ్‌కు దగ్గరగా ఈత కొడుతున్నట్లు కనిపిస్తుండగా, మహంత తన సెల్ఫోన్లో మొత్తం సంఘటనను రికార్డు చేసినట్లు సిట్ వెల్లడించింది. వారిద్దరినీ ఆరు రోజులుగా విచారించినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు వారిని 14 రోజుల సిఐడి (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కస్టడీకి పంపింది. గోస్వామి, మహంతలపై హత్య, నేరపూరిత కుట్ర మరియు నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైన నేరాల క్రింద అభియోగాలు మోపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని సిట్ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే నేరం పూర్తి రీతిలో రుజువవ్వాల్సి ఉంది. అధికారులు త్వరలో సింగపూర్‌లోని ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి అనుమతులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ నుండి కీలక ఆధారాలను సేకరించేందుకు బృందం వేచి ఉంది అని కూడా అధికారులు తెలిపారు.
Recent Random Post:















