
ఈ మధ్య స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటనల్లో నటించడం సహజమే అయిపోయింది. మహేష్ బాబు అయితే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటూ, ఒక్కొక్కటి లెక్కపెట్టడం కూడా అభిమానులకు కష్టమే. జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ టైంలో యాడ్స్ చేయడం తగ్గించాడు కానీ, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగాడు. తాజాగా, ఆన్లైన్ డెలివరీ సర్వీస్ జెప్టో కోసం ఓ యాడ్ చేశాడు. యాడ్ కంటెంట్ వెరైటీగా ఉండటంతో ఆకర్షణీయంగా అనిపించింది. అయితే, ఎక్కువగా చర్చనీయాంశం అయినది ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, లుక్ గురించే.
ఈ యాడ్ రిలీజ్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో ప్రధానంగా యాంటీ ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నట్టుగా కనిపించింది. నిజానికి, ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ చివరి దశ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి ప్రత్యేకమైన లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే ఎయిర్పోర్ట్, ఫంక్షన్లలో తక్కువగా కనిపిస్తున్నాడు. ఇటీవల హృతిక్ రోషన్‌తో కలిసి ఓ పాట షూట్లో పాల్గొన్నాడు కూడా. ఈ టైంలో వచ్చిన జెప్టో యాడ్ కోసం స్పెషల్‌గా మేనేజ్ చేసుకుని, కొంచెం కొత్తగా ట్రై చేశాడు. అయితే, అది అందరికీ అంతగా కనెక్ట్ కాలేదు. సాధారణంగా ఏ యాడ్ అయినా లుక్ టెస్ట్ చేస్తారు. కానీ, దీని విషయంలో అంతగా పట్టించుకోలేదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, కేవలం కొన్ని సెకన్ల పాటు వచ్చే యాడ్‌పై ఇంత చర్చ అవసరమా? అనేది మరో కోణం. చిరంజీవి గతంలో ఓ పాల ప్రకటనలో మాస్ లుక్‌లో కనిపించగా, దాని మీద కూడా ట్రోలింగ్ వచ్చిందని గుర్తు చేసుకోవచ్చు. అభిమానులు ఊహించుకునే స్థాయి ఎక్కువ కావడం లేదా యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడానికి కారణం వెతుక్కోవడమో ఇలాంటి పరిణామాలకు దారి తీస్తాయి. ఇకపోతే, జెప్టో యాడ్ మొదటిదేనట, రెండో యాడ్ కూడా త్వరలో విడుదల కానుంది. ‘వార్ 2’ ప్రమోషన్లు వేసవిలో ప్రారంభమవుతాయని సమాచారం. అప్పటికి ఎన్టీఆర్ తన లుక్‌పై ఉన్న సందేహాలకు చెక్ పెట్టేయొచ్చు!
Recent Random Post:















