జైలర్ 2లో నాగార్జున విలన్?

Share


సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో హీరోగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా అక్కినేని నాగార్జునను తీసుకోవాలని దర్శకులు ఆలోచిస్తున్నారన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫ్యాన్స్‌లో కొంత ఆసక్తి, కొంత అసంతృప్తి కలిగిస్తోంది.

ఇప్పటికే నాగ్ “కూలీ” సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. అంతే కాకుండా “కుబేర”లోనూ ఓ ముఖ్యమైన క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆయ‌న సోలో హీరోగా లేరు — ఒకదానిలో మామ పాత్ర, మరొకదానిలో అల్లుడు క్యారెక్టర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు “జైలర్ 2″లో విలన్ పాత్ర అంటే, నాగ్ అభిమానుల్లో అసంతృప్తి మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది.

“నా సామిరంగా” తర్వాత నాగార్జున పూర్తి హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదన్నదే అభిమానుల్లో ప్రధాన గునపాటు. తండేల్‌తో నాగచైతన్య మంచి ఊపు మీద ఉన్నాడు. అఖిల్‌కి లెనిన్‌తో మంచి బ్రేక్ రావొచ్చని అంచనా. సుమంత్‌కి “అనగనగా ఓка రోజు” మంచి పేరు తీసుకొస్తోంది. ఇలాంటి సమయంలో నాగ్‌ కూడా మళ్ళీ మాస్‌లోకి వస్తే అక్కినేని ఫ్యాన్స్‌కి పండగే.

“జైలర్ 2″లో విలన్ పాత్ర అంటే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తీయబోయే క్యారెక్టర్ పక్కా వయొలెంట్ గానే ఉంటుంది. అలాంటి క్యారెక్టర్‌కి నాగార్జున సరైన ఎంపిక కాదన్నదే కొంతమంది అభిప్రాయం. గతంలో కూలీ సినిమా కోసమేనైనా, రోలెక్స్ స్థాయి క్యారెక్టర్ వుందంటేనే నాగ్ ఓకే చేశారన్నది ఓ ప్రముఖ సమాచారం.

నాగ్ వందో సినిమా కోసమే తమిళ దర్శకుడు కార్తీక్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఆ మైలురాయిని బ్యాలెన్స్ చేయటానికి “బిగ్ బాస్ 9” హోస్టింగ్ చేస్తూనే ప్యాన్ ఇండియా ప్లానింగ్ జరుగుతోందట.

ప్రస్తుతం “జైలర్ 2” గాసిప్ ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. అంతకుముందు జూన్ 20న “కుబేర” విడుదల కానుంది. ధనుష్ హీరో అయినా నాగార్జున పాత్రకూ చాలా ప్రాధాన్యత ఉంటుందట. చూద్దాం ఈ కింగ్ ఎలా కనపడి మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి వస్తారో!


Recent Random Post: