ఎన్టీఆర్ దేవర 2 పై ఆసక్తి ఎందుకు పెరిగింది?

Share


యంగ్ టైగర్ ఎన్టీఆర్, జక్కన్న తెరకెక్కించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆస్కార్‌ను సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది. ఇక RRR తరువాత ఎన్టీఆర్‌కు నేషనల్ వైడ్‌గా భారీ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అంతేకాదు, బాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

ఈ చిత్రానికి తరువాత ఎన్టీఆర్ దేవర అనే భారీ యాక్షన్ డ్రామాను చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. RRR తరవాత ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ దేవర చిత్రం చాలా పసలేని కథతో వచ్చినందున అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను సాధించినా, సినిమా కంటెంట్ పరంగా అసంతృప్తిని మిగిల్చింది.

అయితే, మొదటి భాగం అంతగా ఆకట్టుకోలేకపోయినా, ప్రస్తుతం దేవర 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ త్వరలోనే దేవర 2ను తెరపైకి తీసుకురాబోతున్నాడు. అయితే, ఈ సీక్వెల్‌పై సినీ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. నిజంగా రెండో భాగంలో అంతటి శక్తివంతమైన కథ ఉందా? లేక ఎన్టీఆర్ ఇప్పటికే క‌మిట్ అయ్యాడు కాబట్టి పూర్తి చేయాలనుకుంటున్నారా? లేదా ఎన్టీఆర్‌కు దేవర క్యారెక్టర్ ఎంతో నచ్చిందా? అన్న ప్రశ్నలు అభిమానులను తెగ కంగారు పెట్టిస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్‌లో వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. దేవర 2 ఎన్టీఆర్ కెరీర్‌లో ఎలా నిలిచిపోతుందో చూడాలి!


Recent Random Post: