
ఇప్పటి తరం హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా తమ అందం, గ్లామర్‌తో ఇండస్ట్రీలో వెలుగులు నింపుతున్నారు. ఒకప్పుడు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత హీరోయిన్స్‌కి పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. నలభైకి చేరుకున్నాక క్యారెక్టర్ రోల్స్, యాభైలోకి వెళ్ళాక అమ్మమ్మ పాత్రలు మాత్రమే దక్కేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ తరం సీనియర్ హీరోయిన్స్ యాభై ఏళ్లు దాటినా కూడా ఇంకా హీరోయిన్గా, లేదా ముఖ్యమైన పాత్రల్లో బిజీగా ఉంటున్నారు.
ఇందులో ప్రధానంగా టబు పేరు చెప్పుకోవాలి. టబు 52 ఏళ్లు పూర్తిచేసుకున్నా, ఆమె అందం మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పటికీ ఆమె ఫోటోలు చూస్తే ముప్పై-నలభై ఏళ్ల మధ్య వయసులో ఉన్నట్టే కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. టబు వయసు తెలుసుకున్న తర్వాత చాలా మందికి నమ్మశక్యం కాని విషయం అవుతుంది.
తాజాగా టబు షేర్ చేసిన చీర కట్టులోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో టబు అందం, అందమైన చిరునవ్వు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చీరలో టబు లుక్స్‌కి నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందం, ఇంత గ్లామర్ ఉండటమే కారణం ఇప్పటికీ టబుకి హీరోయిన్స్ పాత్రలు వస్తుండటానికి అని అంటున్నారు.
సీనియర్ హీరోలతో పోలిస్తే టబు చాలా యంగ్‌గా కనబడుతుంది. అందుకే అనేకమంది స్టార్ హీరోలు ఆమెతో జోడీగా నటించడానికి ఇష్టపడుతున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా టబు తన నటనతో, అందంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆమెపై ఉన్న అభిమానమే నేటికీ అలాగే కొనసాగుతోంది. ఇకపై కూడా ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టబు వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ ఆసక్తికరమైన వార్తలు వచ్చినా, ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. కానీ కెరీర్లో మాత్రం ఎప్పటికీ లీడ్‌లోనే కొనసాగుతోంది.
Recent Random Post:















