
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరో స్థానం మారుతూ వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్న తెరపైకి వచ్చింది. టాలీవుడ్ టాప్ ప్లేస్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్దా? లేక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దా? అంటూ నెటిజన్లు, సినీ విశ్లేషకులు, అభిమానులు గట్టిగానే చర్చిస్తున్నారు.
నిజానికి బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ నేషనల్ వైడ్‌గా స్టార్‌డమ్‌ను సంపాదించారు. నార్త్ ఇండియాలోనూ భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. వాటిలో కొన్ని విజయాలు సాధించినప్పటికీ, మరికొన్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.
దీంతో ప్రభాస్ కెరీర్లో కొద్దిగా డిస్ట్రబెన్స్ కనిపించినా, గ్రాండ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టామినా, ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికీ డార్లింగ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ ఆయన మార్కెట్ ఎంత బలంగా ఉందో చూపిస్తూనే ఉన్నాయి.
ఇక మరోవైపు అల్లు అర్జున్ దూకుడు ఈ మధ్య మరింత పెరిగిందన్నది స్పష్టమైన నిజం. కెరీర్ ఆరంభం నుంచి కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించిన బన్నీ, క్రమంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఆర్య, రేసుగుర్రం, సరైనోడు వంటి హిట్లతో స్టార్ రేంజ్‌కు చేరిన ఆయన, పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించారు.
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, డైలాగ్ డెలివరీ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో బన్నీకి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. సినిమా ఎంపికలో కేర్, పాత్ర కోసం చేసే హార్డ్ వర్క్ ఆయన కెరీర్‌ను స్టెబుల్‌గా ముందుకు నడిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్, స్టైల్ అన్నింటిలోనూ ప్రత్యేక గుర్తింపుతో స్థిరంగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు అసలు కీలకమైన అంశం రాబోయే సినిమాలే. ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్లుగా నిలిస్తే ఆయన డామినేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే, బన్నీ అగ్రస్థానాన్ని స్టేబుల్ చేసుకునే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
Recent Random Post:















