డీజే టిల్లు రీమేక్.. అసలు దిమాక్ ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట పాటతోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యింది. ఇక ఆ పాట తోనే చిత్ర యూనిట్ థియేటర్లోకి ప్రేక్షకులను రప్పించేలా చేసింది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ నటించిన విధానం కూడా బాగానే వర్కౌట్ అయింది.

అతని రచన సహకారం అలాగే యాక్టింగ్ స్కిల్స్ కూడా సినిమాలు డిఫరెంట్ గా ఉండడంతో తెలంగాణ యాస మరింత కొత్తగా అనిపించింది. అయితే ఇలాంటి సినిమాను రీమేక్ చేయలేని బాలివుడ్ ప్రముఖ బడా ప్రొడక్షన్ హౌస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను కూడా ఫాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సినిమాకు తెలంగాణ డైలాగ్స్ అనేవి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. కొన్ని సన్నివేశాలు రచించిన విధానం కూడా మన నేటివిటికి తగ్గట్టుగా ఉండటం కూడా బాగా కలిసి వచ్చింది. అసలు కథ మాత్రం అంత కొత్తగా ఏమీ ఉండదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు చాలా రొటీన్ గానే ఉంటాయి. కేవలం హీరో క్యారెక్టర్ తెలంగాణ యాస ఒక పాట మాత్రమే సినిమాలో మేజర్ హైలైట్ గా నిలిచింది.

సంక్రాంతి కాబట్టి ఆ హడావిడిలో సినిమాకు మరికొంత కలెక్షన్స్ పెరిగాయి. ఇక ఇలాంటి కథను హిందీలో ఏ విధంగా రీమేక్ చేస్తారు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇలాంటి లోకల్ కథను హిందీ జనాలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు అనే విధంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి బాలీవుడ్ బడా సంస్థ డీజే టిల్లు కథను ఏ విధంగా ప్రజెంట్ చేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ కూడా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Recent Random Post: