తనని అలా చూసి పిల్లలు భయపడ్డారన్న అజయ్..!

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక నటుడు సక్సెస్ అనిపించుకోవడం వెనక పడే కష్టం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో అవమానాలు కష్టాలు బాధలు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం లో అనుభవం జరుగుతూ ఉంటాయి. ఇన్ని కష్టాలు పడుతుంటారు కాబట్టి వారికి వచ్చిన ఆ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తుంటారు.

నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అన్నది మామూలు విషయం కాదు. అది కూడా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ముందు సైడ్ రోల్స్ చేస్తూ తర్వాత విలన్ గా మెప్పించి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన అజయ్ కూడా తెలుగు మంచి నటులలో ఒకరని చెప్పొచ్చు.

ఇప్పుడు నటుడిగా ఒక మంచి స్థానంలో ఉన్న అతను తన కెరీర్ లోని కష్టాల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఖుషి సినిమాలో ఒక చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన అజయ్ అలానే చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు.

రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో పూర్తిస్థాయి విలన్ గా అది కూడా మెయిన్ విలన్ గా ఛాన్స్ అందుకున్నారు. ఆ సినిమా టైం లో తన దగ్గరకు పిల్లలు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు అజయ్. తన హైట్ తనకు ప్లస్ అని.. అదే కొన్నిసార్లు మైనస్ కూడా అన్నారు అజయ్.

ఇక నేపాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్లిన డబ్బులు అయిపోతే అక్కడ హోటల్ లో గిన్నెలు కూడా కడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అజయ్. ఒక సినిమా షూటింగ్ లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పుకొచ్చారు అజయ్. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్న ఆయన తమిళ హీరో అజిత్ నటించిన తునివు తెలుగులో తెగింపుగా వస్తుంది. అందులో కూడా మంచి పాత్ర చేసినట్టు చెప్పుకొచ్చారు.

తన కెరీర్ లో సినిమా కష్టాల గురించి చెప్పి ప్రేక్షకుల హృదయాలను టచ్ చేశారు అజయ్. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న అజయ్ సైడ్ రోల్స్ నుంచి సోలో విలన్ గా ఎదిగాడు. అయితే మరీ విలన్ గా నెగిటివ్ అవుతున్నాం అనుకునే టైం లో సాఫ్ట్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ వస్తున్నారు. ఆర్య 2లో అజయ్ చేసిన పాత్ర ఇంప్రెస్ చేసింది. ఇక సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా కూడా ఒక ప్రయత్నం చేసిన అజయ్ విలన్ గా చేస్తూ హీరోగా చేస్తే ప్రేక్షకులు చూడరని ఆ ప్రయత్నాలు మానేసినట్టు చెప్పుకొచ్చారు.


Recent Random Post: