తమ్ముడు కోసం హీరోయిన్స్ చేసిన విభిన్న ప్రయత్నాలు!

Share


నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాలో ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. విశేషమేమంటే, ఈ ముగ్గురూ తమ పాత్రల కోసం ప్రత్యేకంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారు.

వర్ష బొల్లమ్మ తన క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకోగా, మరో హీరోయిన్ సప్తిమి గౌడ గుర్రపు స్వారీపై శిక్షణ తీసుకున్నారు. కానీ మూడవ హీరోయిన్ స్వసిక విజయ్ మాత్రం డైరెక్టర్ ఇచ్చిన మరో సవాలును స్వీకరించారు.

తన పాత్ర కోసం స్వసిక స్మోకింగ్ ప్రాక్టీస్ చేసింది! ఇది ఆమెకు పూర్తి కొత్త అనుభవం. ‘‘క్యారెక్టర్ డిమాండ్‌గా డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు సిగరెట్ తాగడం నేర్చుకోవాలని చెప్పారు. అందుకే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్మోకింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒకసారి నా తల్లి ముందే స్మోక్ చేయాల్సి వచ్చింది. అప్పుడే నేను ఆమెకు ఇది నా ఉద్యోగానికి సంబంధించిన విషయమని చెప్పాను,’’ అంటూ స్వసిక చెప్పింది.

‘‘సినిమాలో నేను స్మోక్ చేసే దృశ్యాలన్నీ నిజమైన సిగరెట్లతోనే చిత్రీకరించాం. మొత్తం సినిమాలో ఐదు సీన్లను మినహా చేస్తే ప్రతి సీన్‌లోనూ నేను స్మోక్ చేస్తూనే కనిపిస్తాను. ఆ వాసన వల్ల నాకు తలనొప్పి, వాంతులు కూడా వచ్చాయి,’’ అని ఆమె వివరించింది.

ఒక్క స్వసిక మాత్రమే కాదు, ఈ సినిమాలో లయ నితిన్ అక్కగా కనిపించనుండగా, ఆమె కూడా చెప్పుల్లేకుండా పూర్తి పాత్రను పోషించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ఈ సంగతులన్నీ చూస్తే, తమ్ముడు సినిమాలోని ప్రతి పాత్రకి డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఓ ప్రత్యేకమైన మ్యానరిజం డిజైన్ చేసినట్టు స్పష్టమవుతుంది.


Recent Random Post: