
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు నటనతో అలరిస్తూనే, మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, మొదటి సినిమాతోనే ఘనవిజయం సాధించారు. చిన్న బడ్జెట్‌తో వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసి, కొత్త తరహా సినిమాలకు తలుపులు తెరిచింది.
అయితే రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. కానీ సినిమా కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తరుణ్, కీడా కోలా అనే వినూత్న సినిమాతో వచ్చారు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక తాజాగా ఆయన నటుడిగా ఓం శాంతి అనే సినిమాలో సోలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయహే సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. ఇదే సమయంలో ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ కోసం తరుణ్ స్క్రిప్ట్ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. హీరోగా విశ్వక్ సేన్‌ను తీసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు.
ఇంతలో మరో ఆసక్తికర టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలో తాను దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పెళ్లి చూపులుతో మొదలైన వీరి కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై కనపడనున్నదా? అనే ఆసక్తికర చర్చ అభిమానుల మధ్య నడుస్తోంది. అధికారికంగా ఏదైనా ప్రకటన రాలేను కానీ, ఈ కాంబినేషన్ నిజమైతే మరోసారి కంటెంట్‌తో కూడిన మంచి సినిమా వస్తుందని cine circles భావిస్తున్నాయి.
Recent Random Post:















