తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా: ఆగస్టు 1న విడుదల

Share


టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా, ప్రస్తుతం మిరాయ్ చిత్రం చేస్తోంది. హనుమాన్ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన తేజ, ఇప్పుడు మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అంచనాలు అప్పటికే ఆడియన్స్‌లో మరింతగా పెరిగాయి.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే, హల్క్ రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆధ్యాత్మిక అంశాలు మరియు ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ సూపర్ యోధగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా సినిమా కాన్సెప్ట్ స్పష్టం అయింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం, జెట్ స్పీడ్ లో మేకర్స్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు పెండింగ్ పార్ట్ ను పూర్తి చేస్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

ఆగస్టు 1వ తేదీకి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆగస్టు లో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి, అందులో ఎన్టీఆర్ సినిమా వార్-2, రజినీకాంత్ కూలీ, ఉపేంద్ర 45 వంటి పలు ప్రముఖ చిత్రాలు రెండో వారంలో విడుదల కానున్నాయి.

ఈ నేపథ్యంలో మిరాయ్ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నా, సెకెండ్ వీక్ లో విడుదల అవ్వనున్న చిత్రాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. అటువంటి పరిస్థితుల్లో, ఆగస్టు 1వ తేదీని మిరాయ్ మూవీ మేకర్స్ నిర్ణయించి, ముందుచూపుతో ప్లస్ అవ్వాలని భావిస్తున్నారు.


Recent Random Post: