
‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడని అందరూ ఊహించారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన వీరి కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోందని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి. నిర్మాతలు బన్నీ వాసు, నాగవంశీ కూడా దీనిపై ఎన్నో సార్లు హింట్లు ఇచ్చారు.
అయితే అనూహ్యంగా బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టును పక్కనపెట్టి అట్లీ దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించడంతో అందరికీ షాక్ తగిలింది. అయినప్పటికీ, అట్లీ సినిమాకు తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఈ కథలో మరొక కొత్త మలుపు తిరిగింది.
త్రివిక్రమ్ ప్రస్తుతం అదే కథను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలని నిర్ణయించాడనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ పూర్తయ్యాక తారక్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్‌తో జట్టు కడతాడని వార్తలు వస్తున్నాయి. ఈలోపు త్రివిక్రమ్ మరో చిన్న సినిమా పూర్తి చేసి సిద్ధంగా ఉంటాడు.
ఇదంతా చూస్తే తారక్ – బన్నీ మధ్య కథలు మారడం కొత్త విషయం కాదు. కొరటాల శివ కూడా మొదట బన్నీతో సినిమా ప్లాన్ చేసి చివరికి తారక్‌తో దేవర సినిమా చేసిన సంగతి తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్ ప్రొడక్షన్‌లో మొదట తారక్ సినిమా చేయాలనుకున్నా, అది వర్కౌట్ కాక చివరికి బన్నీతో ప్రకటించారు. కానీ తిరిగి కథ మలుపు తిరిగి ‘దేవర’ రూపొందింది.
అలాగే త్రివిక్రమ్ కూడా ‘అల వైకుంఠపురములో’ తర్వాత తారక్‌తో ‘అయిననా పోయి రావలె హస్తినకు’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది కూడా నిలిచిపోయి చివరికి గుంటూరు కారం తీశాడు. ఇక ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్‌కు బదులుగా తారక్‌తో అదే కథ తీయాలని రంగం సిద్ధం చేస్తున్నారు.
మొత్తానికి తారక్ – బన్నీ మధ్య కథల మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఏదైతేనేం, ఈ మార్పుల మధ్య తారక్‌కు వరుసగా టాప్ డైరెక్టర్స్‌తో భారీ సినిమాలు చేయాల్సిన అవకాశాలు వస్తుండటం విశేషమే.
Recent Random Post:















