దక్షిణాది పరిశ్రమ క్రమశిక్షణపై శ్రుతి హాసన్ ప్రశంసలు

Share


“ఒకరిని పొగడటం అంటే ఇంకొకరిని తిట్టడం కాదు” — కానీ శ్రుతి హాసన్ చెప్పిన మాటలు మాత్రం హిందీ చిత్రసీమపై పరోక్ష విమర్శలా మారాయి. దక్షిణాది సినిమా పరిశ్రమపై ప్రశంసలు కురిపించిన ఆమె, ఇక్కడి సంస్కృతి, క్రమశిక్షణ, గౌరవం గురించి హృదయపూర్వకంగా మాట్లాడింది.

“దక్షిణాది చిత్రసీమలో ప్రతి పని క్రమశిక్షణతో జరుగుతుంది. సినిమా ప్రారంభం పూజలతో, కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయబద్ధంగా చేస్తారు. అందరూ వినయంగా ఉంటారు, సెట్లో నియమాలు పాటిస్తారు. హిందీ పరిశ్రమలో ఇది అరుదుగా కనిపిస్తుంది,” అని శ్రుతి హాసన్ వెల్లడించింది.

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో క్రమశిక్షణ లోపం గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. స్టార్‌లు ఇష్టానుసారం సెట్స్‌కి ఆలస్యంగా రావడం, టీమ్‌పై ఒత్తిడి పెంచడం వంటి విషయాలు తరచుగా వినిపిస్తున్నాయి. దర్శకుడు అభినవ్ కశ్యప్, నటి కంగనా రనౌత్ వంటి పలువురు ఇప్పటికే ఉత్తరాది స్టార్‌ల వర్క్ కల్చర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

ఇక దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఉత్తరాది పరిశ్రమలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల దక్షిణాదికి వచ్చానని ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడే నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

అలాగే శ్రుతి హాసన్ తన వ్యక్తిగత జీవితంపై కూడా స్పష్టంగా మాట్లాడింది. “ప్రేమ, పని, జీవితంపై నిజాయితీగా మాట్లాడితే సమాజం అంగీకరించదు. నేను నా కాస్మోటిక్ సర్జరీల గురించి నిజాయితీగా చెప్పినందుకు కొందరు విమర్శించారు. కానీ నేను ఎవరో నమ్మి మారను. నేను నాకే నిజంగా ఉంటాను,” అని ఆమె తెలిపింది.

దక్షిణాది పరిశ్రమపై ఇంత నిజమైన ప్రశంసలు చెబుతూ, శ్రుతి హాసన్ మరోసారి తన స్పష్టమైన ఆలోచనలతో చర్చనీయాంశమైంది.


Recent Random Post: