దర్శన్‌ అభిమానుల బెదిరింపులతో రమ్య ఆవేదన

Share


కన్నడ భామ, రాజకీయ నాయకురాలు రమ్య (దివ్య స్పందన) తాజాగా చేసిన వ్యాఖ్యలు కర్ణాటక సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన రమ్య, ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు.

దివంగత అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్టార్ హీరో దర్శన్‌పై కేసు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దర్శన్ అభిమానుల నుంచి వస్తున్న వేధింపులు భరించలేకపోతున్నానని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా ఆమె వెల్లడిస్తూ –
“కొంతమంది దర్శన్ అభిమానులు రోజూ నన్ను, నా పిల్లలను కూడా వదలకుండా అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతున్నారు. రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారు. రేణుకాస్వామి విషయంలో చూపిన హింసాత్మక వైఖరిలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మహిళలపై దాడి చేస్తున్నారు. ఈ మెసేజ్‌లన్నింటినీ నా లాయర్‌తో చర్చించాను. త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి స్క్రీన్‌షాట్‌లతో సహా సమర్పిస్తాను” అని అన్నారు.

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఇలా దుర్వినియోగం కావడం బాధాకరమని రమ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, తాను రేణుకాస్వామి హత్య కేసుపై ఓ పోస్ట్ పెట్టిన వెంటనే దర్శన్ అభిమానులు అసభ్యకరంగా కామెంట్లు చేయడంతో ఈ విషయం పెద్ద దుమారం రేపింది. రమ్య ఆ కామెంట్ల స్క్రీన్‌షాట్‌లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం మరింత చర్చనీయాంశమైంది.

దర్శన్ అభిమానుల ప్రవర్తనపై రమ్య చేసిన ఈ ఆవేదన ప్రస్తుతం కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.


Recent Random Post: