ది బెంగాల్ ఫైల్స్ రిలీజ్‌పై వివాదం

Share


ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ది కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్ వంటి వివాదాస్పద సినిమాలతో గుర్తింపు పొందారు. తాజాగా ఆయన రూపొందించిన ది బెంగాల్ ఫైల్స్ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లో, అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు.

సినిమా నేపథ్యంగా ఇండిపెండెన్స్ డే ముందు కోల్‌కతా లో జరిగిన సంఘటనలు తీసుకున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సినిమా రిలీజ్‌కి అడ్డంకి వేస్తోంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. వారి ప్రకారం, ప్రభుత్వం సినిమా విషయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అందుకే, చిత్ర యూనిట్ రిట్ పిటిషన్ వేసే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

చివరగా, ప్రభుత్వానికి చెందిన కొంత మంది ప్రతినిధులు థియేటర్ ఓనర్లను బెదిరిస్తున్నారని, సినిమా రిలీజ్ అయితే తీవ్ర పరిణామాలు ఉండవచ్చని వార్నింగ్ ఇచ్చారని కొంత మంది ఓనర్లు చిత్ర యూనిట్‌కు తెలిపారు. థియేటర్ ఓనర్లు, “సినిమా రిలీజ్ అయితే మనకు ఏం జరుగుతుందో తెలుసా?” అని అడిగారని, అందుకే చిత్ర యూనిట్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు.

లక్షలాది బెంగాలీ ప్రజలు ది బెంగాల్ ఫైల్స్ చూడాలనుకుంటున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది మూర్తికు నిర్మాతల్లో ఒకరు, పల్లవి జోషి, విజ్ఞప్తి చేశారు.


Recent Random Post: