‘ది రాజాసాబ్’ సక్సెస్ వెనుక ప్రభాస్ క్రియేటివిటీ: మారుతి వెల్లడి

Share


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా తనదైన మార్క్‌ను క్రియేట్ చేస్తూ భారీ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రభాస్, ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైకాలజికల్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ప్రభాస్ స్టార్డమ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ‘ది రాజాసాబ్’ నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అధికారిక పోస్టర్ విడుదల చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా, జరీనా వహాబ్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు.

సినిమా సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మారుతి మాట్లాడుతూ,
“ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ‘ది రాజాసాబ్’ లాంటి సినిమాలు చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా ప్రభాస్ వృద్ధుడిగా కనిపించే సన్నివేశాలు, రివర్స్ నరేషన్ ఉన్న సీన్స్ కోసం మేమంతా రాత్రింబవళ్లు కష్టపడ్డాం. కానీ ప్రభాస్ ఆ కష్టాన్ని మాకు చాలా ఈజీ చేశారు. కొన్ని కీలక సన్నివేశాల విషయంలో ఆయన తన ఐడియాలను షేర్ చేస్తూ, దర్శకత్వానికి సహకరించారు. ఈ సినిమా కలెక్షన్లు బాగా రావడం అంటే, ప్రేక్షకులు ప్రభాస్‌ను కొత్త జానర్‌లో అంగీకరించినట్లే” అని అన్నారు.

మారుతి వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ, “ప్రభాస్‌లో నటుడే కాదు, ఓ మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా సైలెంట్‌గా ఉండే ప్రభాస్‌లో ఇంత క్రియేటివ్ థింకింగ్ ఉందా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే, తొలిసారి కామెడీ–హారర్ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన చిత్రం ఇదే కావడం విశేషం. ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి.

ప్రభాస్ కొత్త జానర్స్‌ను ట్రై చేస్తూ, పాన్ ఇండియా స్థాయిలో తన రేంజ్‌ను మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నాడని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Recent Random Post: