దీపికా పదుకొనే: భారతంలో AI వాయిస్‌లతో తొలి సెలబ్రిటీ

Share


గత కొన్ని రోజులుగా వరుస వివాదాలను ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో నెగెటివిటీని సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే, ఇప్పుడు అదే స్థాయిలో గౌరవాలను కూడా అందుకుంటోంది. ఈమె చేసిన వ్యాఖ్యలు, పెట్టిన షరతులు కొంతమందికి అసహజంగా అనిపించినా, పలువురు సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలవడం గమనార్హం.

ఇలాంటి సమయంలో దీపిక వరుసగా ప్రతిష్టాత్మక గౌరవాలను అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా గుర్తింపు పొందిన ఆమెను, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ “మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారి”గా నియమించింది. ఆ గౌరవం తరువాత కేవలం కొన్ని రోజులకే, దీపిక మరో అరుదైన రికార్డు సృష్టించింది — భారతదేశం నుండి AI టెక్నాలజీకి తన వాయిస్‌ను అందించిన తొలి సెలబ్రిటీగా నిలిచింది.

మెటా ఏఐ (Meta AI) సంస్థతో కలిసి పనిచేసిన దీపిక, తన గొంతును AI మోడల్ కోసం అందించింది. “ఇప్పుడు నేను మెటా ఏఐలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశం, అమెరికా, కెనడా, యుకె, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో నా వాయిస్ ద్వారా ఇంగ్లీష్‌లో చాట్ చేయవచ్చు. ఒకసారి ప్రయత్నించి, మీ అభిప్రాయం చెప్పండి,” అంటూ దీపిక తన సోషల్ మీడియా వీడియోలో వెల్లడించింది.

మెటా ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక AI చాట్‌బాట్ యాప్‌ టెక్స్ట్, ఇమేజ్, వీడియోల ఆధారంగా ట్రెయిన్ చేయబడింది. దీంతో వినియోగదారులు అడిగే ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇవ్వగలదు. అంతేకాదు, వాయిస్‌తో కూడా మాట్లాడి వివిధ అంశాలపై సలహాలు అందిస్తుంది. ఇక ఇప్పుడు ఈ అనుభవాన్ని దీపికా పదుకొనే వాయిస్‌లో వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

యూజర్లు ఆమెతో ఎప్పుడైనా చాట్ చేయవచ్చు — అయితే ఇది పూర్తిగా AI ఆధారిత వాయిస్ మాత్రమేనని గుర్తించాలి. అయినప్పటికీ, అభిమానులకు ఇది కొత్త అనుభూతిని ఇస్తోంది.

మొత్తానికి, భారతదేశంలో AI కి తన వాయిస్ అందించిన తొలి సెలబ్రిటీగా దీపికా పదుకొనే చరిత్ర సృష్టించింది. ఇటీవల ఎదురైన నెగెటివ్ ఫేజ్ తర్వాత, ఈ గుర్తింపులు ఆమె అదృష్టం మళ్లీ మెరుగుపడుతోందని సూచిస్తున్నాయి.


Recent Random Post: